
మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ
ఆసిఫాబాద్‌రూరల్: చలో హైదరాబాద్ మహా ధర్నాను విజయవంతం చేయాలని పీఆర్‌టీ యూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నా రు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం సంఘం నాయకులతో కలిసి మహాధర్నా పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేయాల ని, పాత పెన్షన్ ఇవ్వాలని సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి ఉపాధ్యాయులు అధి క సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాత పెన్షన్ విధానాన్ని 2004 నుంచి రద్దు చేయడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వృద్ధాప్యంలో పెన్షన్‌కు దూరమయ్యారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్, నా యకులు రాజశేఖర్, ప్రకాశ్, ఎంఈవో సుభా ష్, వినేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.