
ప్రతిభకు ప్రశంస
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసన మండలి చైర్మన్ బండ ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ చూపిన 125 మంది అధికారులు, సిబ్బందికి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్‌బాబు, అధికారులతో కలిసి ఆయన ప్రశంసాపత్రాలు అందించారు. కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతోపాటు డీటీడీవో రమాదేవి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సజీవన్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషారావు, కాగజ్ నగర్ డీఎస్పీ రామానుజం తదితరులు ప్రశంసాపత్రాలు అందుకున్నారు.

ప్రతిభకు ప్రశంస

ప్రతిభకు ప్రశంస

ప్రతిభకు ప్రశంస

ప్రతిభకు ప్రశంస

ప్రతిభకు ప్రశంస

ప్రతిభకు ప్రశంస

ప్రతిభకు ప్రశంస

ప్రతిభకు ప్రశంస