కోనప్ప Vs ఆర్ఎస్ ప్రవీణ్ గా మారిన సిర్పూర్ రాజకీయం

- - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌: జిల్లాలో శాసనసభ ఎన్నికలు సెగ పుట్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సిర్పూర్‌ బరిలో నిలిచిన బీఆర్‌ఎస్‌, బీఎస్పీ అభ్యర్థులు ‘నువ్వా– నేనా’ అన్నట్లు సిగపట్లకు దిగుతుండటంతో నియోజకవర్గంలో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రచారంలో భాగంగా ఇరు పార్టీల శ్రేణులు బాహాబాహీకి దిగుతుండటం ఘర్షణకు దారితీస్తోంది. అభ్యర్థులు ఏకంగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి వెళ్లడంతో ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనని రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆరోపణలు.. ప్రత్యారోపణలు
రాష్ట్రంలోనే వరుస పరంగా నంబర్‌– 1 నియోజకవర్గమైన సిర్పూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోనేరు కోనప్ప నాలుగోసారి బరిలో ఉన్నారు. రావి శ్రీనివాస్‌, పాల్వాయి హరీశ్‌బాబు, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేశారు. కాగా.. 2014లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో కోనేరు కోనప్ప బీఎస్పీ తరఫున ఎన్నికల్లో నిలబడి గెలిచి.. బీఆర్‌ఎస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు అదే బీఎస్పీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌(ఆర్‌ఎస్పీ) కోనప్పకు పోటీగా నిలబడ్డారు. కోనప్పను కచ్చితంగా ఓడించి తీరుతానని ఆర్‌ఎస్పీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

చాపకింద నీరులా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఎస్పీ దూసుకెళ్లేలా ప్రణాళికలు రచించారు. గ్రామం, మండలం, పట్టణం.. ఇలా ఇంటింటా తిరుగుతూ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఒక దశలో ‘కోనేరు కోనప్ప.. కలప దొంగ’ అంటూ మీడియా ముందు తీవ్ర ఆరోపణలు చేయడం.. అందుకు కౌంటర్‌గా కోనప్ప ‘మర్డర్లు చేసిన ఘనత మాకే ఉంది. ఎన్‌కౌంటర్లు కూడా మేమే చేపించాం. పరిటాల రవిని మేమే చంపించాం. బెల్లంపల్లి, కరీంనగర్‌లో హత్యలు మేమే చేపించాం. ప్రవీణ్‌కుమార్‌ ఒక పొలిటికల్‌ టూరిస్ట్‌’ అంటూ ఆర్‌ఎస్పీపై ప్రత్యారోపణలు చేశారు. అప్పటి నుంచి ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పార్టీ శ్రేణుల్లో ఘర్షణ వాతావరణం..
నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌, బీఎస్పీలకు చెందిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు వర్గాలుగా విడిపోయి ప్రచారంలో పాల్గొంటున్నారు. శ్రేణుల ప్రచారం తారస్థాయికి చేరడమే కాకుండా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నెల 11న కాగజ్‌నగర్‌ పట్టణంలోని బస్టాండ్‌ ఏరియాలో బీఎస్పీ కార్యకర్త షేక్‌ ఆసిఫ్‌ను బీఆర్‌ఎస్‌ నాయకుడు కోనేరు ఫణితోపాటు పలువురు ఆకారణంగా దాడిచేయడమే కాకుండా చంపుతామని బెదిరించినట్లు ఆరోపిస్తూ బాధితుడు ఆసిఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పోలీసులు ఫణితోపాటు పలువురిపై కేసు సైతం నమోదు చేశారు.

ఇక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీల్లో ఉన్న అసంతృప్తులకు అభ్యర్థులు గాలం వేస్తుండటం.. భారీ ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చి తమవైపు తిప్పుకోవడం పరిపాటిగా మారింది. పార్టీ ఫిరాయింపులు గెలుపోటములపై ప్రభావం చూపుతుండటంతో అభ్యర్థులు దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఫలితంగా ప్రచారంలో ప్రత్యర్థులపై దాడులకు దిగడానికి సైతం వెనుకాడకపోవడంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆదివారం రాత్రి కాగజ్‌నగర్‌ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయబస్తీలో ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

అనంతరం బీఆర్‌ఎస్‌ ప్రచార రథం డైవర్‌పై దాడి చేశారంటూ ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. తమ ప్రచారాన్ని అడ్డుకోవడమే కాకుండా అన్యాయంగా కేసు పెట్టారని నిరసన తెలుపుతూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్పీ కాగజ్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో బైఠాయించారు. పోలీసులు చివరకు ఇరువర్గాల అభ్యర్థులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. అయితే ఇలాంటివి పునరావృతమైతే మాత్రం నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం పోలీసులకు సవాలుగా మారనుంది.

Read latest Komaram Bheem News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

16-11-2023
Nov 16, 2023, 11:24 IST
ఇబ్రహీంపట్నం: కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి దండెం రాంరెడ్డి బుధవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇబ్రహీంపట్నం స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌...
16-11-2023
Nov 16, 2023, 10:49 IST
రోడ్‌ షోలు, బహిరంగ సభలు అత్యధికంగా నాంపల్లి నుంచి 34 మంది కంటోన్మెంట్‌ నుంచి అత్యల్పంగా 10 మంది.. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఇదీ పరిస్థితి ఎన్నికలకు...
16-11-2023
Nov 16, 2023, 10:46 IST
ఆదిలాబాద్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ నుంచి టిక్కెట్‌ను ఆశించిన గండ్రత్‌ సుజాత నిరాదరణకు గురయ్యారు. ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ టిక్కెట్‌ కంది...
16-11-2023
Nov 16, 2023, 10:37 IST
సాక్షి, మేడ్చల్‌ జిల్లా: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో పోటీలో...
16-11-2023
Nov 16, 2023, 09:59 IST
సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఈ క్రమంలో అందరి దృష్టిని మాత్రం ఓ పాట ఆకర్షిస్తోంది. అన్ని...
16-11-2023
Nov 16, 2023, 09:38 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/జెడ్పీసెంటర్‌ /జడ్చర్ల/ దేవరకద్ర: ఎన్నికల ప్రక్రియలో కీలకఘట్టం ముగిసింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అసెంబ్లీ...
16-11-2023
Nov 16, 2023, 08:28 IST
సాక్షి,ఆదిలాబాద్‌: ‘ఆదివాసీ, లంబాడాలు కాంగ్రెస్‌ పార్టీకి రెండు కళ్ల లాంటివారు.. 12 అసెంబ్లీ స్థానాల్లో ఆరు లంబాడాలకు, ఆరు ఆదివాసీలకు...
16-11-2023
Nov 16, 2023, 07:25 IST
యాదగిరిగుట్ట రూరల్‌: ‘నేను ఓట్లు అడుక్కోవడానికి వచ్చాను.. మీ దయ ఉంటే ఓట్లు వేయండి.. లేదంటే లేదు’ అని ఆలేరు...
16-11-2023
Nov 16, 2023, 06:27 IST
వెంగళరావు నగర్‌: కాంగ్రెస్‌ పార్టీ హయాంలో మాత్రమే నగరం అభివృద్ధి చెందిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం...
16-11-2023
Nov 16, 2023, 06:27 IST
హైదరాబాద్: ముస్లిం గొంతును వినిపించే ఆల్‌ ఇండియా మజ్లిస్‌–ఏ– ఇత్తేహదుల్‌ ముస్లిమీన్‌న్‌ (ఏఐఎంఐఎం) పార్టీ ‘గోషామహల్‌ –జూబ్లీహిల్స్‌’ అసెంబ్లీ స్థానాలపై వ్యవహరిస్తున్న...
16-11-2023
Nov 16, 2023, 05:27 IST
సిరిసిల్ల: బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాగానే దళితులు, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు ఇస్తామని ఆ పార్టీ...
16-11-2023
Nov 16, 2023, 05:08 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల్లో భారత్‌ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) పూర్తి మెజారిటీ సాధించి మూడోసారి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని వైద్య ఆరోగ్య,...
16-11-2023
Nov 16, 2023, 04:14 IST
కాంగ్రెస్‌ నాయకులు రాహుల్, రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని అంటున్నారు. అలా చేస్తే రైతులు అరేబియా సముద్రానికి వెళ్లాల్సిన...
16-11-2023
Nov 16, 2023, 03:27 IST
సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈనెల 17న తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి...
15-11-2023
Nov 15, 2023, 20:58 IST
పోలింగ్‌ తేదీన వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తెలంగాణ కార్మిక శాఖ.. 
15-11-2023
Nov 15, 2023, 16:57 IST
ప్రచారం కోసం ఎండలో తిరిగితే కనీసం డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్లిపోతే..  
15-11-2023
Nov 15, 2023, 15:57 IST
సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు కాగా.. సగానికి సగం అభ్యర్థులు నామినేషన్లు
15-11-2023
Nov 15, 2023, 12:26 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల్లోని ఆ నేతల చుట్టే...
15-11-2023
Nov 15, 2023, 12:11 IST
నిర్మల్‌: అతివలు రాజకీయ రంగాన్ని శాసిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులూ ఉన్నారు. జనాభాలో, ఓటరు జాబితాలో...
15-11-2023
Nov 15, 2023, 11:19 IST
జగిత్యాల: నామినేషన్ల ఘట్టం ముగిసిపోవడంతో బుధవారం ఎవరెవరు అభ్యర్థులు బరిలో ఉంటారో తెలుస్తుంది. ఈసారి స్వతంత్రులు అధికంగానే ఉన్నారు. ఉమ్మడి... 

Read also in:
Back to Top