● దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం గోపాలకృష్ణన్ ● ఖమ్మం స్టేషన్‌లో పనులు పరిశీలన
ఖమ్మం రాపర్తినగర్: అమృత్ భారత్ పథకం కింద ఎంపికై న ఖమ్మం రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు మూడేళ్లుగా చేపడుతున్నా పూర్తికాకపోవడంపై దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం డాక్టర్ గోపాలకృష్ణన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం ఆయన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడారు. పనుల్లో ఇకనైనా వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని, తద్వారా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అనంతరం రైల్వే స్టేషన్ బయట ఖాళీ స్థలాన్ని పరిశీలించిన డీఆర్‌ఎం.. పార్కింగ్‌కు కేటాయింపుపై చర్చించారు. అంతేకాక ఖమ్మం రైల్వేస్టేషన్ ఆవరణలో ఆధునికీకరణ, ప్రధాన భవనం పనులపై సూచనలు చేశారు. ఆ తర్వాత డీఆర్‌ఎం విలేకరులతో మాట్లాడుతూ ఖమ్మం స్టేషన్‌లో కేరళ ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్‌పై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని తెలిపారు. అనంతరం మోటమర్రి, కొత్తగూడెం, మణుగూరు రైల్వేస్టేషన్ల తనిఖీకి ఆయన ప్రత్యేక రైలులో బయలుదేరారు. ఎస్‌ఆర్ డీఓఎంలు డి.నరేంద్రవర్మ, హర్ష, ఖమ్మం స్టేషన్ మేనేజర్ ఎం.రాజేంద్ర, సీసీఐ ప్రసన్నకుమార్, ఆర్‌పీఎఫ్ సీఐ బి.సురేష్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.


