ఖమ్మం స్పోర్ట్స్: ఆల్ ఇండియా టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నీ శుక్రవారం ముగిసింది. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మూడు రోజులుగా జరుగుతున్న టోర్నీకి వివిధ రాష్ట్రాల క్రీడాకారులు హాజరయ్యారు. ఈమేరకు బాలుర విభాగంలో సింగిల్స్ టైటిల్‌ను తెలంగాణకు చెందిన జయాన్మహ్మద్, బాలికల విభాగంలో కనిష్క గోవింద కై వసం చేసుకుంది. బాలుర విభాగంలో అర్జున్దువా(హరియాణా), బాలికల విభాగంలో కాసావి(కర్ణాటక) రెండో స్థానాన నిలిచారు. అలాగే, బాలుర డబుల్స్‌లో జయాన్ మహ్మద్ – అర్జున్దోవా, జోయేల్ జాన్సన్ – అదిష్, బాలికల్లో వర అనుహ – కనిష్క గోవిందా, కాసావి – ధత్రిశర్మ వరుసగా ప్రథమ, ద్వితీయస్థానాలు దక్కించుకున్నారు. వీరికి టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.సత్యనారాయణ తదితరులు బహుమతులు అందజేశారు.


