ఇంటి నిర్మాణ అనుమతులపై కొర్రీలు | - | Sakshi
Sakshi News home page

ఇంటి నిర్మాణ అనుమతులపై కొర్రీలు

Nov 16 2026 12:08 AM | Updated on Nov 16 2026 12:08 AM

● కేఎంసీ చుట్టూ తిరుగుతున్న స్థల యజమానులు ● చుట్టూ ఇళ్లు ఉన్నా ఇరిగేషన్‌ అనుమతి కావాలని సూచనలు ● అక్కడ సిబ్బంది కొరతతో సర్టిఫికెట్‌ జారీలో ఆలస్యం

ఎన్‌ఓసీ ఎప్పుడంటే...

● కేఎంసీ చుట్టూ తిరుగుతున్న స్థల యజమానులు ● చుట్టూ ఇళ్లు ఉన్నా ఇరిగేషన్‌ అనుమతి కావాలని సూచనలు ● అక్కడ సిబ్బంది కొరతతో సర్టిఫికెట్‌ జారీలో ఆలస్యం

అన్నీ ఉంటే నిర్ణీత వ్యవధిలో..

ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో ఇంటి నిర్మాణానికి తెలంగాణ మున్సిపాలిటీ చట్టం–2019 ద్వారా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణం చేపట్టాలనుకునే వ్యక్తి టీఎస్‌–బీపీఏఎస్‌(తెలంగాణ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టమ్‌)లో దరఖాస్తు చేసుకోవాలి. ఈక్రమాన స్థల యజమానులు ప్లాట్‌ పరిమాణం, ఎన్ని అంతస్తుల్లో నిర్మిస్తారనే వివరాలతో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జత చేయాలి. అన్నీ సవ్యంగా ఉంటే నిర్ణీత కాల వ్యవధిలో అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది.

కావాల్సిందే..

ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. అవసరం ఉన్నా, లేకున్నా నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాల్సిందేనని చెబుతుండడంతో స్థల యజమానులు ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు, కాంప్లెక్స్‌ నిర్మాణానికి అనుమతి ఇవ్వాల్సిన స్థలాన్ని పరిశీలించకుండానే సర్టిఫికెట్‌ కావాలంటున్నారని తెలుస్తోంది. అత్యధికంగా నీటి పారుదల శాఖ నుంచి ఎన్‌ఓసీ కావాలంటున్నారని, స్థలం నీటిపారుదల శాఖతో సంబంధం లేకపోయినా అడగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

అనుమతులు రాక..

కేఎంసీ సిబ్బంది ఎక్కువగా నీటిపారుదల శాఖ నుంచి ఎన్‌ఓసీలు తీసుకురావాలని చెబుతుండడంతో నిర్మాణ అనుమతుల జారీలో జాప్యం జరుగుతోంది. ఆ శాఖలో సరిపడా సిబ్బంది లేకపోవడం, ఇతర కారణాలతో ఎన్‌ఓసీలు త్వరగా అందడం లేదు. ఫలితంగా స్థల యజమానులు నీటిపారుదల శాఖ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. ప్రస్తుతం కేఎంసీలో ఇంటి నిర్మాణ అనుమతి దరఖాస్తులు 425 పెండింగ్‌ ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ఎన్‌ఓసీల కోసం పెండింగ్‌ పెట్టగా, అత్యధికంగా నీటిపారుదల శాఖవే ఉండడం గమనార్హం. ఫలితంగా ఇంటి నిర్మాణం చేపట్టడంలో ఆలస్యం జరుగుతోందని యజమానులు వాపోతున్నారు. ఎన్‌ఓసీల విషయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తే తప్ప సమస్యకు పరిష్కారం లభించే అవకాశం లేనందున ఉన్నతాధికారులు దృష్టి సారించాలనే సూచనలు వస్తున్నాయి.

ఇల్లు లేదా భవన నిర్మాణానికి కార్పొరేషన్‌ నుంచి అనుమతి ఇచ్చే క్రమాన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఈక్రమాన స్థలం ఏదైనా విభాగం పరిధిలో ఉంటే ఆ విభాగం నుంచి ‘నో ఆబ్జక్షన్‌ సర్టిఫికెట్‌’ సమర్పించాలని యజమానికి సూచిస్తారు. ఎత్తయిన భవనాలు, వ్యాపారపరమైన కాంప్లెక్స్‌లు నిర్మించే సమయాన అగ్నిమాపక శాఖ నుంచి, ఎయిర్‌ పోర్ట్‌కు పరిధిలో ఉంటే ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ నుంచి సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, రైల్వేస్టేషన్‌, ట్రాక్‌ సమీపాన నిర్మాణ స్థలం ఉంటే రైల్వే శాఖ నుంచి, చెరువులు, కుంటలు, నదులు, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలోనైతే నీటి పారుదల శాఖ నుంచి, స్థలం పైనుంచి లేదా పక్క నుంచి హై టెన్షన్‌ విద్యుత్‌ లైన్‌ వెళ్తుంటే విద్యుత్‌శాఖ నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలి. అంతేకాక ప్రభుత్వ భూముల సరిహద్దుల సమీపాన స్థలం ఉంటే కలెక్టర్‌ నుంచి ఎన్‌ఓసీ సమర్పించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement