మధిర: చిన్నారుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే భవిష్యత్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారని అమ్మ ఫౌండేషన్ చైర్‌పర్సన్ మల్లు నందిని పేర్కొన్నారు. మధిరకు చెందిన రామభక్త సీతయ్య కళాపరిషత్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న 28వ జాతీయస్థాయి బాలోత్సవ్ పోటీలు ఆదివారం రెండో రోజు కు చేరాయి. ఈ సందర్భంగా పోటీలను ప్రారంభించిన నందిని మాట్లాడారు. కళాపరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు పుతుంబాక శ్రీకృష్ణ ప్రసాద్, బాబ్లా, కాంగ్రెస్ నాయకులు, నిర్వాహకులు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పారుపల్లి విజయకుమార్, తలుపుల వెంకటేశ్వర్లు, టీ.వీ.రెడ్డి, రంగా శ్రీనివాసరావు, వనజ తదితరులు పాల్గొన్నారు.
‘బాలోత్సవ్’లో అమ్మ ఫౌండేషన్
చైర్‌పర్సన్ నందిని


