పీఆర్‌టీయూ | - | Sakshi
Sakshi News home page

పీఆర్‌టీయూ

Nov 16 2026 12:08 AM | Updated on Nov 16 2026 12:08 AM

జిల్లా కార్యవర్గం ఎన్నిక

జిల్లా కార్యవర్గం ఎన్నిక

ఖమ్మం సహకారనగర్‌: పీఆర్‌టీయూ జిల్లా కమిటీ ని ఆదివారం ఖమ్మంలో ఎన్నుకున్నారు. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్‌రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. దీంతో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడిగా రామిశెట్టి రంగారావు, ప్రధాన కార్యదర్శిగా గోరంట్ల విజయ్‌ అమృతకుమార్‌ను ఎన్నుకున్నారు. అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఆర్‌.బ్రహ్మరెడ్డి, తాళ్లూరి చంద్రశేఖర్‌, గౌరవ అధ్యక్షుడిగా తులుపునూరి రత్నకుమార్‌ ఎన్నికయ్యారు. అనంతరం శేఖర్‌రావును సత్కరించారు. జిల్లా మాజీ అధ్యక్షులు మోత్కూరి మధుతో పాటు నాయకులు యలమద్ది వెంకటేశ్వర్లు, కందుల వెంకటనర్సయ్య, సుజాత, రత్నకుమార్‌, చిత్తలూరి ప్రసాదరావు, సుబ్బయ్య, తాళ్లూరు వేణు, ఝాన్సీ సౌజన్య, రాము, భారతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement