నేడు పిల్లల ప్రజావాణి | - | Sakshi
Sakshi News home page

నేడు పిల్లల ప్రజావాణి

Nov 16 2026 12:08 AM | Updated on Nov 16 2026 12:08 AM

ఖమ్మం సహకారనగర్‌: బలహీన, వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలు తమ సమస్యలు, ఫిర్యాదులు, హక్కులకు సంబంధించిన అంశాలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చేందుకు సోమవారం పిల్లల ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ దివాకర తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగే ఈ ప్రజావాణిలో పిల్లల భద్రత, రక్షణ, విద్య, ఆరోగ్యం, పోషణ, అభివృద్ధికి సంబంధించి సమస్యలు తెలుసుకుని, పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు.

విద్యుత్‌ లేన్ల విస్తరణకు రూ.13.89 కోట్లు

మధిర: మధిర నియోజకవర్గ పరిధిలో అవసరమైన చోట విద్యుత్‌ లేన్ల విస్తరణ పనులకు ప్రభుత్వం రూ.13.89 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు 7వ తేదీన జీఓ జారీ అయింది. ఎన్పీడీసీఎల్‌ నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది.

ఏసీబీ కార్యాలయానికి సొంత గూడు !

ఖమ్మం క్రైం: ఏళ్లుగా ఖమ్మం వీడీవోస్‌ కాలనీలోని అద్దె ఇంట్లో కొనసాగుతున్న ఉమ్మడి జిల్లా ఏసీబీ కార్యాలయానికి ఎట్టకేలకు ప్రభుత్వ భవనాన్ని కేటాయించారు. ఖమ్మం స్టేషన్‌రోడ్డులోని పాత మున్సిపాలిటీ కార్యాలయాన్ని ఏసీబీ కార్యాలయ నిర్వహణకు కేటాయించగా, డీఎస్పీ వై.రమేష్‌ ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలకు ఎవరు నగదు డిమాండ్‌ చేసినా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈమేరకు టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు సమాచారం ఇచ్చేలా విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌లు పూర్తి

నేటి నుంచి జాతీయస్థాయి టెన్నిస్‌ పోటీలు

ఖమ్మం స్పోర్ట్స్‌: ఆల్‌ ఇండియా టెన్నిస్‌ ర్యాంకింగ్‌ పోటీలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూనియర్‌ కేటగిరీలో జరిగే పోటీల్లో భాగంగా ఆదివారం క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలబాలికలు 32 మంది చొప్పున మెయిన్‌ డ్రాకు అర్హత సాధించారు. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఉండగా, సోమవారం నుంచి 20వ తేదీ వరకు పోటీలు జరుగుతాయని నిర్వాహకుడు కె.సత్యనారాయణ వెల్లడించారు.

హెచ్‌ఎంల సంఘం నూతన కమిటీ ఎన్నిక

ఆరోసారి అధ్యక్షుడిగా రాయల వీరస్వామి

ఖమ్మం సహకారనగర్‌: గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా నూతన కమిటీని ఆదివా రం ఎన్నుకున్నారు. ఖమ్మంలోని జెడ్పీ హాల్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.గిరిధర్‌, రాష్ట్ర కార్యదర్శి రాజు కమిటీ వివరాలను ప్రకటించారు. హెచ్‌ఎంల సంఘం జిల్లా అధ్యక్షుడిగా రాయల వీరస్వామి ఆరో సా రి ఎన్నికవడం విశేషం. అలాగే, జిల్లా ప్రధాన కార్యదర్శిగా దామాల పుల్లయ్య, గౌరవ అధ్యక్షుడిగా ఎన్‌.దామోదర ప్రసాద్‌, కోశాధికారిగా కె.శైలజాలక్ష్మి, స్టేట్‌ కౌన్సిలర్లుగా ఆర్‌.వెంకట్రావు, కె.మార్క్‌, టి.సుబ్బారావు ఎన్నికై నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు నూతన కమిటీని అభినందించారు.

తల్లిపాలు, వ్యాక్సిన్లతో శిశువులకు ఆరోగ్యం

ఖమ్మం వైద్యవిభాగం: శిశువులకు తల్లిపాలు పట్టించడంతో పాటు నిర్ణీత సమయానికి వైద్యపరీక్షలు చేయిస్తూ వ్యాక్సిన్లు వేయిస్తే ఆరోగ్యవంతంగా ఉంటారని చిన్నపిల్లల వైద్య నిపుణు డు బాబు రత్నాకర్‌ తెలిపారు. జాతీయ నవజా త శిశు వారోత్సవాల్లో భాగంగా ఖమ్మం ప్రభు త్వ జనరల్‌ ఆస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో ఆదివారం బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ బరువుతో, నెలలు నిండకముందే జన్మించిన శిశువుల సంరక్షణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పౌష్టికాహారం అందించడంతో పాటు శిశువుల ఎదుగుదలను పరి శీలిస్తూ వైద్య పరీక్షలు చేయించడమే కాక నిర్ణీత సమయానికి వ్యాక్సిన్లు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు చేతన్‌, బెనర్జీ, నర్సింగ్‌ ఆఫీసర్లు దీప్తి, వాణి, కుమారి, ల్యాబ్‌ టెక్నీషియన్‌ ముబీన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement