ఐక్యంగా ముందుకు సాగితేనే ఫలితం | - | Sakshi
Sakshi News home page

ఐక్యంగా ముందుకు సాగితేనే ఫలితం

Nov 16 2026 12:08 AM | Updated on Nov 16 2026 12:08 AM

ఖమ్మం మామిళ్లగూడెం: సంఘీయులు ఐక్యంగా ముందుకు సాగితే పదవులు వాటంతటవే దరి చేరతాయని రాజ్యసభ సభ్యుడు, మున్నూరుకాపు సంఘం గౌరవ అధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర వెల్లడించారు. అంతేతప్ప కలహాలకు దిగితే వచ్చే పదవులు రాకుండా పోతాయన్నారు. మున్నూరుకాపు సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యాన ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన వన సమారాధనలో ఆయన మాట్లాడుతూ కులంలో పదవులు ఉంటేనే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతామనుకోవడం భ్రమ మాత్రమేనని చెప్పారు. అనంతరం ప్రభుత్వ సలహాదారుడు వి.హనుమంతరావుతో పాటు మాజీ మంత్రులు గంగుల కమలాకర్‌, జోగు రామన్న, మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఆర్‌టీసీ మాజీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుటం పురుషోత్తమరావు తదితరులు మాట్లాడారు.

ఉత్సాహంగా.. ఉల్లాసంగా

ఖమ్మం గొల్లగూడెం రోడ్డులోని చెరుకూరి మామిడి తోటలో జరిగిన వన మున్నూరుకాపు వన సమారాధనకు పెద్దసంఖ్యలో కులస్తులు ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారులు తమ ఆటపాటలతో అలరించారు. అనంతరం అతిథులను వద్దిరాజు సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు శీలంశెట్టి వీరభద్రం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కంచి సత్యనారాయణ, ఆకుల రాజయ్య, ఎడవల్లి కృష్ణ, కొడిమ్యాల మధుసూదన్‌, మరిశెట్టి రాఘవయ్య, గాలి అనిల్‌కుమార్‌, తూడి ప్రవీణ్‌కుమార్‌, రౌతు కనకయ్య, ఎర్రా నాగేంద్రబాబు, పగడాల మంజుల, వాసుదేవుల వెంకటనర్సయ్య, కాసా హన్మంతరావు, వద్దిరాజు కిషన్‌, రమేష్‌ హజారీ, ఆకుల రజిత్‌ కుమార్‌, ఊసా రఘు, కంచి సత్యనారాయణ, ఆవుల రామారావు, దిండిగల రాజేందర్‌, చెరుకూరి శేషగిరిరావు, బాపట్ల మురళి, వద్దిరాజు వెంకటేశ్వర్లు, భీమా శ్రీధర్‌, బండారు రుక్మేందర్‌, చందా గోపి, రావి రాంబాబు, కొత్త సీతారాములు, ఆకుల గాంధీ, ఆకుతోట ఆదినా రాయణ, డాక్టర్‌ తోట లక్ష్మణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

ఎంపీ, మున్నూరుకాపు సంఘం

గౌరవ అధ్యక్షుడు వద్దిరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement