ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు కూసుమంచి మండలం నేలపట్లలో శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి పోతురాజు దేవాలయ విగ్రహ యంత్ర ప్రతిష్ఠ మహోత్సవానికి హాజరవుతారు. ఆ తర్వాత 3గంటలకు తిరుమలాయపాలెం మండలం బీరోలు, 5గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో లబ్ధిదారులకు చేయూత మంజూరు పత్రాలను మంత్రి పంపిణీ చేస్తారని క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ దయాకర్‌రెడ్డి తెలిపారు.
జమలాపురంలో
శ్రీవారికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్య కల్యాణం జరిపించారు. తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాల భక్తుల సమక్షాన పల్లకీ సేవ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
ప్రజలకు
సత్వర న్యాయమే లక్ష్యం
పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు
ఖమ్మంక్రైం: టీజీపీఎస్సీ ఆధ్వర్యాన నిర్వహించే శాఖాపరమైన పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా సాగేలా బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. ఈమేరకు పరీక్ష కేంద్రాల వద్ద 14వ తేదీ నుంచి 23వ తేదీ సాయంత్రం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు ఆటంకం కలిగేలా ఎవరైనా వ్యవహరించినా, ఆంక్షలను ఉల్లంఘించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈమేరకు కేంద్రాల సమీపంలోని నివాసితులు, వ్యాపారులు సహకరించాలని సూచించారు.
విధుల్లో చేరిన
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు
ఖమ్మం వైద్యవిభాగం: సమస్యల పరిష్కరించాలనే డిమాండ్‌తో గత 32రోజులుగా సమ్మెలో ఉన్న వైద్య, ఆరోగ్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్‌కు చెందిన 576 ఉద్యోగులు శనివారం విధుల్లో చేరారు. ఉద్యోగ సంఘం నాయకులతో శుక్రవారం జరిగిన చర్చల్లో సమస్యలపై చర్చించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసి, మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో ప్రజలకు వైద్య సేవల్లో అంతరాయం కలగొద్దనే భావనతో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ బాధ్యులు తాత్కాలికంగా సమ్మె విరమణకు నిర్ణయించారు. ఈమేరకు జిల్లా సంఘం నాయకులు విధుల్లో చేరుతున్నట్లు డీఎంహెచ్‌ఓ రామారావుకు లేఖ అందజేశారు.


