ఆర్‌టీసీ ప్రయాణికులకు ‘సీజన్‌’ బొనాంజా | - | Sakshi
Sakshi News home page

ఆర్‌టీసీ ప్రయాణికులకు ‘సీజన్‌’ బొనాంజా

Nov 15 2026 1:26 PM | Updated on Nov 15 2026 1:26 PM

ఖమ్మంమయూరిసెంటర్‌: నిత్యం బస్సుల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులపై చార్జీల భారాన్ని తగ్గించేందుకు ఆర్‌టీసీ ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఒకటి నుంచి మూడు నెలల కాలానికి గాను మంత్లీ సీజన్‌ పాస్‌లతో నగదు ఆదా చేసుకోవచ్చని ఖమ్మం రీజియన్‌ మేనేజర్‌ ఏ.సరిరామ్‌ తెలిపారు. సాధారణ టికెట్‌ ధరలతో పోలిస్తే పాస్‌తో లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. మంత్లీ సీజన్‌ టికెట్‌ పాస్‌ కలిగిన వారు ఆదివారాల్లో హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌, నల్లగొండ, కరీంనగర్‌ నగరాల్లో తిరిగే సిటీ బస్సు (ఎయిర్‌పోర్ట్‌ పుష్పక్‌ బస్సులు మినహా)ల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఇతర మార్గాల్లో సూపర్‌ లగ్జరీ, ఆపై కేటగిరీ బస్సు బేసిక్‌ చార్జీలో 10 శాతం రాయితీ లభిస్తుందని చెప్పారు. పల్లెవెలుగు పాస్‌ ఉన్నవారు అదనంగా రూ.20 చెల్లించి కాంబీ టికెట్‌తో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో, ఎక్స్‌ప్రెస్‌ పాస్‌ ఉన్నవారు డీలక్స్‌ బస్సుల్లో ప్రయాణించవచ్చని ఆర్‌ఎం తెలిపారు. నిత్యం రాకపోకలు సాగించే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకోవాలని సూచించారు.

ప్రతీ 20 నిమిషాలకు డీలక్స్‌ బస్సు..

ఖమ్మం – భద్రాచలం, ఖమ్మం – సత్తుపల్లి మార్గాల్లో ప్రతీ 20 నిమిషాలకు ఒక డీలక్స్‌ బస్సు నడుపుతున్నామని ఆర్‌ఎం సరిరామ్‌ వివరించారు. ప్రయాణికుల సౌకర్యార్థం నడిపిస్తున్న ఈ బస్సుల్లో వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ఆయన తెలిపారు.

నెలవారీ సీజన్‌ టికెట్‌తో చార్జీలు ఆదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement