జోరుగా.. హుషారుగా ! | - | Sakshi
Sakshi News home page

జోరుగా.. హుషారుగా !

Nov 15 2026 1:26 PM | Updated on Nov 15 2026 1:26 PM

మధిర: మధిరలో 28వ జాతీయ స్థాయి బాలోత్సవ్‌ శనివారం ప్రారంభమైంది. బంజారా కాలనీలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన బాలోత్సవ్‌ను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సామినేని సుజాత రామనాథం, ఎంఈఓ సీహెచ్‌.శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామభక్త సీతయ్య కళాపరిషత్‌ అధ్యక్షుడు పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ మధిర కళలకు పుట్టినిల్లుగా నిలుస్తోందని తెలిపారు. అంతరించిపోతున్న కళలను పరిరక్షించడంతోపాటు చిన్నారులను ప్రోత్సహించేలా బాలోత్సవ్‌ నిర్వహిస్తున్న కళాపరిషత్‌ కార్యదర్శి రామావత్‌ బాబ్లాను అభినందించారు. ఈ కార్యక్రమంలో మారోని బాయి, పీఆర్‌టీయూ జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు ఆర్‌.బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన విద్యార్థులు చేసిన సంప్రదాయ నృత్యాలు, ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి

వారసత్వంగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బాలోత్సవ్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ చిన్నారుల్లో కళలపై ఆసక్తిని పెంపొందిస్తే సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసానికి బాటలు పడతాయని చెప్పారు. అనంతరం వివిధ కళారూపాలు ప్రదర్శించిన చిన్నారులను మంత్రి అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు.

మధిరలో ప్రారంభమైన ‘బాలోత్సవ్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement