టీయూసీఐ మహాసభలను జయప్రదం చేయండి | - | Sakshi
Sakshi News home page

టీయూసీఐ మహాసభలను జయప్రదం చేయండి

Nov 4 2026 1:32 AM | Updated on Nov 4 2026 1:32 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: వచ్చే ఏడాది జనవరిలో కోల్‌కతాలో జరగనున్న ట్రేడ్‌ యూనియన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా(టీయూసీఐ) జాతీయ మహాసభల విజయవంతానికి అందరూ సహకరించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎల్‌.పద్మ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు ఏ.వెంకన్న అధ్యక్షతన మంగళవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికులకు శ్రమకి తగ్గ పలితం లేకపోగా, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ వ్యవస్థను పెంచి కనీస వేతనం, ఉద్యోగ భద్రత, లేకుండా చేశారని పేర్కొన్నారు. ఈమేరకు కార్మిక హక్కులపై జరుగుతున్న దాడిని తిప్పికొట్టేందుకు టీయూసీఐ అఖిల భారత మహాసభలు దోహదపడతాయని తెలిపారు. ఈ సమావేశంలో టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామయ్య, నాయకులు సీ.వై.పుల్లయ్య, శ్రీనివాస్‌, ఆవుల అశోక్‌, పగిడి కత్తుల రామదాసు, గోస్‌ పుల్లయ్య, ధరావత్‌ సక్రు, కె.పుల్లారావు, పేరబోయిన వెంకన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement