దంచికొట్టిన వాన | - | Sakshi
Sakshi News home page

దంచికొట్టిన వాన

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

పొలాల్లోకి వరద, పలు గ్రామాలకు

స్తంభించిన రాకపోకలు

పోటెత్తుతున్న ప్రాజెక్టులు,

అలుగు పోస్తున్న చెరువులు

అత్యధికంగా పెనుబల్లిలో

22.5 సెం.మీ. వర్షపాతం

జిల్లాలో సగటును 9.2 సెం.మీ.

వర్షపాతం నమోదు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాపై ‘మురసు’ పంజా విసిరింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంట చేలలోకి నీరు చేరగా.. ప్రాజెక్టులు, చెరువులు అలుగు పోస్తున్నాయి. ఫలితంగా కొన్ని గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. జిల్లావ్యాప్తంగా మంగళవారం ఉదయం 8–30నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు సగటున 9.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పెనుబల్లిలో 22.5 సెం.మీ. రికార్డు స్థాయి వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. ఇక బుధవారం రోజంతా జిల్లాలో జల్లులు కురిశాయి. ఉదయం 8–30నుంచి రాత్రి 7 గంటల వరకు 2.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. వేంసూరు మండలంలో అత్యధికంగా 8.5 మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. చలితీవ్రత పెరిగి వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడ్డారు. గురువారం సైతం తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ సీజన్‌లో ఇదే..

ఈ ఏడాది వానాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేశాయి. మళ్లీ ఈ నెలలో అర్నబ్‌ తుపాన్‌తో తక్కువ వర్షపాతమే నమోదు కాగా.. ప్రస్తుతం మురసు తుపాన్‌ ప్రభావంతో జోరువాన కురుస్తోంది. ఈ మొత్తం సీజన్‌లో ఇదే పెద్ద వర్షంగా రికార్డులు చెబుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు సత్తుపల్లి నియోజకవర్గంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. పెనుబల్లిలో 22.5 సెం.మీ, సత్తుపల్లిలో 21.8, వేంసూరులో 21.2, కల్లూరులో 21 సెం.మీ. వర్షం కురిసింది. ఇక బుధవారం రోజంతా జిల్లాలో జల్లులు కురిశాయి. ఉదయం 8–30నుంచి రాత్రి 7 గంటల వరకు 2.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. వేంసూరు మండలంలో అత్యధికంగా 8.5మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. చలితీవ్రత పెరిగి వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడ్డారు. గురువారం సైతం తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ప్రాజెక్టులు, చెరువుల్లోకి వరద..

సీజన్‌లో సరైన వర్షాలు లేక వట్టిపోయిన ప్రాజెక్టులు, చెరువులు ప్రస్తుత తుపాన్‌తో జలకళ సంతరించుకుంటున్నాయి. తల్లాడ మండలం బిల్లుపాడు–రామచంద్రాపురం గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్వహిస్తోంది. పాలేరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నీటినిల్వ సామర్థ్యం 23 అడుగులు కాగా.. ప్రస్తుతం 19.70అడుగులకు చేరింది. వైరా రిజర్వాయర్‌ నీటిమట్టం 19 అడుగులు కాగా, మంగళవారం వరకు 16.8 అడుగులుగా ఉంది. వైరాతో పాటు సమీప మండలాల్లో కురిసిన వర్షంతో వరద చేరగా బుధవారం 19అడుగులకు చేరి అలుగు పోస్తోంది. నీటిమట్టం ఉంది. సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్‌ నీటిమట్టం గరిష్టస్థాయికి చేరి అలుగు పోస్తోంది. పెనుబల్లి మండలంలోని లంకాసాగర్‌ మధ్య తరహా ప్రాజెక్టు 16 అడుగుల సామర్థ్యంతో ఉండగా, ప్రస్తుతం 6వేల క్యూసెక్కుల వరద చేరుతోంది.

స్తంభించిన రాకపోకలు

పెనుబల్లి మండలం పాతకారాయిగూడెం చెరువు అలుగు ఉధృతంగా పారుతుండడంతో రెండు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఎర్రుపాలెం మండలం కట్టలేరుకు వరద ఉధృతి పెరుగుతోంది. సత్తుపల్లి శివారు రాజీవ్‌నగర్‌ వెళ్లే దారిలో పంట పొలాల నుంచి వరద నీరు పోటెత్తింది. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల దీప చెరువు నీరు పోటెత్తడంతో గ్రామంలోని వెళ్లే రహదారి నీట మునిగింది.

జిల్లాపై ‘మురసు’ పంజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement