నేడు మెగా పీటీఎం | - | Sakshi
Sakshi News home page

నేడు మెగా పీటీఎం

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

● విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులతో చర్చ ● ప్రోగ్రెస్‌ కార్డులు అందించనున్న ఉపాధ్యాయులు తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకం

● విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులతో చర్చ ● ప్రోగ్రెస్‌ కార్డులు అందించనున్న ఉపాధ్యాయులు

విద్యార్థుల ప్రగతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకంగా ఉంటుంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేడు పేరెంట్స్‌ – టీచర్స్‌ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాం. తల్లిదండ్రులు ఈ సమావేశాలకు హాజరై పిల్లల విద్యా ప్రగతిని తెలుసుకుని, మెరుగుపడేలా ఉపాధ్యాయులతో సహకరించాలి.

– వాసంతి, జిల్లా విద్యాశాఖాధికారి

ఖమ్మం సహకారనగర్‌: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల పురోగతిని తల్లిదండ్రులకు తెలియజేసేందుకు గాను పేరెంట్స్‌ – టీచర్స్‌ మీటింగ్‌(సమావేశాలు) నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు గురువారం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పీటీఎం నిర్వహించనున్నారు. కాగా, జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధి ప్రభుత్వ విద్యాసంస్థలు 1,176 ఉండగా, 66,650మంది విద్యార్థులు చదువుతున్నారు.

ఎస్‌ఏ ఫలితాలపై విశ్లేషణ

గతనెలలో సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో వచ్చిన విద్యార్థులకు వచ్చిన మార్కులు, వారి అభ్యసన సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరిస్తారు. ఏయే సబ్జెక్టులలో వెనుకబడి ఉన్నారో వివరించి, ఇంటి వద్ద కూడా చదివించేలా సూచనలు చేస్తారు. ఆపై హోలిస్టిక్‌ ప్రోగ్రెస్‌ కార్డులు అందిస్తారు.

అభ్యసన లోపాల గుర్తింపు

ఎస్‌ఏ–1 పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థుల్లో అభ్యసన లోపాలను గుర్తించి, వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు. విద్యార్థులు కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక బోధన అమలుచేస్తారు. అంతేకాక విద్యార్థుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, వారి అభ్యసన స్థాయిని మెరుగుపరచడానికి తీసుకోవా ల్సిన చర్యలపై తల్లిదండ్రులతో చర్చిస్తారు. పాఠశాలతో పాటు ఇంటి వద్ద కూడా అనుకూలమైన అభ్యసన వాతావరణాన్ని కల్పించాలని సూచిస్తారు. కాగా, మెగా పీటీఎంతో పాటు గురువారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పాఠశాల అవసరాలు, సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలపై కమిటీ సభ్యులతో చర్చిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement