ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–17 అథ్లెటిక్స్ పోటీలు బుధవారం ఖమ్మంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా డీఈఓ వాసంతి క్రీడా పతాకాన్ని ఎగురవేసి మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను మరింత మెరుగుపరుచుకునేందుకు పోటీలు దోహదం చేస్తాయని తెలిపారు. గెలుపోటములను సమానంగా స్వీకరించి నైపుణ్యాలు పెంచుకునేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి మాట్లాడుతూ ఖేలో ఇండియా అథ్లెటిక్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. జాతీయస్థాయి పోటీలు సమీపించడంతో వాతావారణం అనుకూలించకపోయినా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శి వై.చిన్ని, ఎంఈఓ శైలజలక్ష్మి, సీఐ ఎస్.కే.నాగుల్‌మీరా, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.కే.రంజాన్, క్రీడా అసోసియేషన్ల బాధ్యులు ఆదర్శ్‌కుమార్, సుధాకర్, నాగూల్ మీరా, కంభం రాము, రోజా, సునీత రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1,500 మీటర్ల పరుగు పందెం పోటీలను డీఈఓ తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో బాలుర విభాగం నుంచి ఎం.గణేష్(నల్లగొండ) ఎం.చరణ్ తేజ(ఆదిలాబాద్), వి.గణేష్(రంగారెడ్డి), బాలికల విభాగంలో ఎం.డీ.ఆస్మిన్(కరీంనగర్), ఎం.రాజేశ్వరి(ఆదిలాబాద్), పి.నక్షత్ర(రంగారెడ్డి) మొదటి మూడు స్థానాలు కై వసం చేసుకున్నారు. కాగా, ఈ పోటీలు గురువారం కూడా కొనసాగనున్నాయి.
అండర్–17 పోటీలకు
500మంది అథ్లెట్ల హాజరు


