ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తూ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. వరద మధ్యలో ఉన్న చెట్టు ఆధారంగా ఉన్న నలుగురిని గుర్తించినా వారి వద్దకు చేరలేకపోయినట్లు తెలిసింది. ఆ తర్వాత రాత్రి 10–35 గంటలకు మత్స్యకారుల ఉన్న ప్రాంతం వద్దకు చేరుకున్నారు. అక్కడ కాకర్లపల్లికి చెందిన పొదిలి శ్రీనివాసరావు, పొదిలి అర్జున్‌రావు, పొదిలి రామయ్య, ఇనుముల అనిల్, రామనగరానికి చెందిన రమేష్ తదితరులను బోటులోకి ఎక్కించుకుని రాత్రి 11–15 గంటలకు ఒడ్డుకు చేరారు. మరో ఆరుగురు సిబ్బంది కోసం తిరిగి గాలింపు మొదలుపెట్టగా, గుర్తించిన నలుగురిని కూడా తీసుకురావాల్సి ఉండడంతో అర్ధరాత్రి పొద్దుపోయే వరకు ఉత్కంఠ కొనసాగుతోంది.


