ఏడుగురు మత్స్యకారులు | - | Sakshi
Sakshi News home page

ఏడుగురు మత్స్యకారులు

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

ఏడుగురు మత్స్యకారులు చాతకొండ బెటాలియన్‌ నుంచి.. మరో ఐదుగురి కోసం వెళ్తుండగా.. జల్లెడ పడుతూ మంత్రులు పొంగులేటి, తుమ్మల పర్యవేక్షణ

వారిని రక్షించేందుకు వెళ్లిన

ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బోట్‌ బోల్తా

రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

కలెక్టర్‌ దివాకర పర్యవేక్షణలో సహాయక చర్యలు

మత్స్యకారులు సురక్షితంగా బయటకు..

ఆరుగురి సిబ్బంది ఆచూకీపై

కొనసాగుతున్న ఉత్కంఠ

తుపాన్‌ ప్రభావంతో మంగళవారం నుంచి జిల్లా అంతటా వర్షం కురుస్తోంది. వర్షప్రభావం సత్తుపల్లి నియోజకవర్గంలో ఎక్కువగా ఉండగా, మండలంలోని బేతుపల్లి చెరువుకు సైతం వరద చేరుతోంది. ఈ విషయం తెలియడంతో చెరువులోని చేపలు వరదలో కొట్టుకుపోకుండా వలల కట్టేందుకు ఎనిమిది మంది మత్స్యకారులు వెళ్లారు. అయితే, వారు వలలు కట్టే సమయానికి వరద ఉధృతి తీవ్రంగా ఉండడం.. ఆపై మరింత పెరగడంతో అందులో చిక్కుకుపోయారు. దీంతో విషయాన్ని స్థానికులకు సమాచారం ఇచ్చేసరికి ఆలస్యం కాగా, సాయంత్రం అధికారులకు విషయం తెలిసింది.

భద్రాద్రి జిల్లా దమ్మపేటకు చెందిన మహిళ వరదలో చిక్కుకోగా ఆమెను రక్షించేందుకు చాతకొండ బెటాలియన్‌ నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెళ్లారు. అక్కడ మహిళను సురక్షిత ప్రాంతానికి చేర్చి తిరిగి బయలుదేరే సమయాన బేతుపల్లి చెరువు వరదలో మత్స్యకారులు చిక్కుకున్నారనే సమాచారాన్ని జిల్లా అధికారులు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందానికి తెలిపారు. దీంతో అక్కడి నుంచి నేరుగా బేతుపల్లికి చేరుకుని రెస్క్యూ బోట్లలో వెళ్లారు. తొలుత రామనగరానికి చెందిన మత్స్యకారుడు బొందల రమేష్‌, కాకర్లపల్లికి చెందిన మరో ఇద్దరు మత్స్యకారులను రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఆ వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.

ఇద్దరిని రక్షించాక ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది 10 మంది రెండు బోట్లలో తిరిగి మత్స్యకారులు ఉన్న చోటుకు బయలుదేరారు. వీరి వెంట దారి చూపించేందుకు సత్తుపల్లి మండలం రామానగరం చెందిన మత్స్యకారుడు బొమ్మకంటి రాజు కూడా బోట్‌ ఎక్కాడు. వరదలో చిక్కుకున్న ఐదుగురు మత్స్యకారులు అలుగు పక్కన ఉన్న సిమెంట్‌ తొరను పట్టుకొని సురక్షితంగానే ఉండడంతో త్వరగానే రక్షించి తీసుకొస్తారని అంతా భావించారు. ఇంతలోనే దమ్మపేట మండలం నుంచి బేతుపల్లికి చెరువు పోటెత్తిన వరద ప్రవాహం అంతకంతకు పెరిగింది. ఈక్రమాన చెరువు నుంచి తమ్మిలేరు వాగుకు వరద పెరగడంతో చెరువు అలుగు వద్ద ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెళ్తున్న బోట్లు తిరగబడ్డాయి. దీంతో వారు అలుగులో నుంచి తమ్మిలేరు వాగులో కొట్టుకుపోయారు. పది మంది సిబ్బంది, వారితో వెళ్లిన మత్స్యకారుడు రాజు కూడా గల్లంతు కాగా.. ఒడ్డున ఉన్న సిబ్బంది అప్రమత్తమయ్యారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బోట్లలో బేతుపల్లి చెరువులోకి వెళ్లి అటు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, ఇటు మత్స్యకారుల కోసం గాలింపు మొదలుపెట్టారు. అంతేకాక చుట్టుపక్కల నుంచి అంబులెన్స్‌లను పిలిపించి పోలీస్‌ సిబ్బందిని భారీగా తరలించారు. అలాగే, సత్తుపల్లి పెద్ద వంతెన దగ్గర వరదలో ఎవరైనా కొట్టుకువస్తే రక్షించేలా పెద్ద తాళ్లతో సిబ్బందిని నియమించారు. మరోపక్క పెద్ద వంతెన బలహీనంగా ఉండటంతో సత్తుపల్లి – అశ్వారావుపేట మధ్య రాకపోకలను నిలిపివేశారు.

వరదలో మత్స్యకారులు గల్లంతవడం, ఆ తర్వాత సిబ్బంది వెళ్లిన బోటు బోల్తా పడడంతో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. సహాయక చర్యల్లో నిమగ్నమైన కలెక్టర్‌ దివాకర, అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

బేతుపల్లి చెరువులో

చిక్కుకున్న మత్స్యకారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement