ఖేలో ఇండియా టోర్నీకి ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఖేలో ఇండియా టోర్నీకి ఏర్పాట్లు

Nov 4 2026 1:32 AM | Updated on Nov 4 2026 1:32 AM

ఖమ్మం స్పోర్ట్స్‌: ఖేలో ఇండియా యూత్‌గేమ్స్‌లో భాగంగా ఖమ్మంకు కేటాయించిన ఆర్చరీ పోటీల నిర్వహణలో ఇబ్బందులు రాకుండా పట్టిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఢిల్లీకి చెందిన శాయ్‌ కోచ్‌, పోటీల కోఆర్డినేటర్‌ రూపేష్‌కుమార్‌ సింగ్‌ సూచించారు. ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో పోటీల నిర్వహణకు ఉన్న వసతులను మంగళవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 300 మందికి పైగా క్రీడాకారులు హాజరవుతారని చెప్పారు. ఈమేరకు పోటీల నిర్వహణతో పాటు క్రీడాకారుల వసతి, భద్రత ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలని తెలిపారు. అంతేకాక క్రీడాభిమానుల కోసం ప్రత్యేక గ్యాలరీలు సిద్ధం చేయాలని చెప్పారు. తెలంగాణ అర్చరీ అసోసియేషన్‌ ప్రతినిధి, జాతీయ ఆర్చరీ డెవలప్‌మెంట్‌ కమిటీ సభ్యుడు పుట్టా శంకరయ్య మాట్లాడుతూ పోటీల నిర్వహణకు ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇందుకోసం టెక్నికల్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి మాట్లాడుతూ పోటీల విజయవంతానికి ఉన్నతాధికారుల సహకారం తీసుకుంటామని తెలిపారు. అథ్లెటిక్స్‌ కోచ్‌ ఎం.డీ.గౌస్‌, మేనేజర్‌ ఉదయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కోఆర్డినేటర్‌, శాయ్‌ కోచ్‌ రూపేష్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement