భద్రాచలం: నిరుద్యోగ గిరిజన యువత పోలీస్ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. ఐటీడీఏ ప్రాంగణంలోని పీఎంఆర్సీ భవనం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అభ్యర్థులతో కూర్చొని బోధను పరిశీలించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ అభ్యర్థులు నోట్స్ ప్రిపేర్ చేసుకుని పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. పీఈటీసీ ప్రిన్సిపాల్ డాక్టర్ వీరూనాయక్, ఏసీఎంఓ రమేష్, కేర్‌టేకర్ సర్వేశ్వర్, వార్డెన్ మోహన్, పీడీలు వసంతం, పార్వతి పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


