గోదాముల్లో పంట నిల్వపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

గోదాముల్లో పంట నిల్వపై అవగాహన

Nov 4 2026 1:32 AM | Updated on Nov 4 2026 1:32 AM

రఘునాథపాలెం: రైతులు పండించిన పంట ఉత్పత్తులను గోదాముల్లో భద్రపర్చుకుని, ధర మెరుగ్గా ఉన్నప్పుడు అమ్ముకుంటే లాభాలు వస్తాయని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐసీఎం) డైరెక్టర్‌ శ్యామ్‌కుమార్‌ తెలిపారు. వేర్‌ హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేటరీ అథారిటీ(డబ్ల్యూడీఆర్‌ఏ), ఐసీఎం ఆధ్వర్యాన రఘునాథపాలెంలో రైతులు, వ్యాపారులు, మిల్లర్లకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్యామ్‌కుమార్‌ మాట్లాడుతూ పంట కోతల సమయంలో తక్కువ ధర ఉన్నప్పుడు విక్రయించకుండా గోదాముల్లో భద్రపర్చుకుని, అనుకూలమైన సమయంలో విక్రయించడం ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందవచ్చని వివరించారు. గోదాముల్లో 50 కిలోల బస్తా నెల అద్దె రూ.5గా నిర్ణయించగా, రైతులకు 35 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. అనంతరం జింకలతండా రోడ్డులో గోదాంను పరిశీలించి రైతులకు అవగాహన కల్పించాలని మేనేజర్‌కు సూచించారు. ఈకార్యక్రమంలో రఘునాథపాలెం పీఏసీఎస్‌ చైర్మన్‌ తాతా రఘురాం, సర్పంచ్‌ గాజుల కృష్ణారావుతో పాటు గొడుగు నర్సింహారావు, బండారు నాగేశ్వరరావు, బోయిన వెంకటనర్సయ్య, బోడా కృష్ణ, నంద్యానాయక్‌, పురం రాములు, గాజుల నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement