ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌

Nov 3 2026 12:39 AM | Updated on Nov 3 2026 12:39 AM

● కేంద్ర ప్రభుత్వ పింఛన్‌దారులకు ప్రయోజనం ● మీసేవ కేంద్రాలతో పాటు సెల్‌ఫోన్‌ ద్వారా కూడా సేవలు

ఆధార్‌ అనుసంధానంతో..

ఉన్న చోట నుంచే సర్టిఫికెట్‌

● కేంద్ర ప్రభుత్వ పింఛన్‌దారులకు ప్రయోజనం ● మీసేవ కేంద్రాలతో పాటు సెల్‌ఫోన్‌ ద్వారా కూడా సేవలు

ఖమ్మం సహకారనగర్‌: కేంద్రప్రభుత్వ రంగ శాఖలతో పాటు సంస్థల్లో విధులు నిర్వర్తించిన వారికి నెలనెలా పింఛన్‌ అందుతుంది. అయితే, ఏటా ఒకసారి వారు జీవించి ఉన్నట్లు సర్టిఫికెట్‌ తప్పనిసరిగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ధ్రువీకరణ పత్రం(లైఫ్‌ సర్టిఫికెట్‌) సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ సర్టిఫికెట్‌ సమర్పించేందుకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి పని లేదు. గతేడాది నుంచి కేంద్ర ప్రభుత్వం జీవన్‌ప్రమాణ్‌ వెబ్‌సైట్‌ ద్వారా డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించే అవకాశం అందుబాటులోకి వచ్చింది.

ఆన్‌లైన్‌లో నమోదు ఇలా..

మీ సేవ కేంద్రాల్లో కాకుండా స్వయంగా కూడా డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీని కోసం https://jeevanpramaan.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలి. ఆపై అప్లికేషన్‌ డౌన్‌ లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఆధార్‌ సంఖ్య, పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌, బ్యాంకు అకౌంట్‌ వివరాలు, మొబైల్‌ నంబర్‌ నమోదు చేయాలి. అనంతరం ఒక నంబర్‌ను కేటాయిస్తూ మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. ఈ నంబర్‌ను పెన్షన్‌ పంపిణీ సంస్థకు సంస్థకు ఆన్‌లైన్‌లో పంపే అవకాశం ఉంది. అలాగే, జీవన్‌ ప్రమాణ్‌ వెబ్‌సైట్‌లో లొకేటెడ్‌ సెంటర్‌ కాలమ్‌ క్లిక్‌ చేస్తే జిల్లాలో సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్‌, వారి ఫోన్‌ నంబర్‌, చిరునామాతో పాటు చిరునామా గూగుల్‌ మ్యాప్‌ ద్వారా కనిపిస్తుంది. నెట్‌ అందుబాటులో లేని వారు సమీపంలోని జీవన్‌ ప్రమాణ్‌ సెంటర్ల జాబితా పొందుటకు ఫోన్‌ నుంచి జేపీఎల్‌ అని ఆంగ్ల అక్షరాలు టైప్‌చేసి స్పేస్‌ ఇచ్చి పిన్‌కోడ్‌ను 77382–99899కు ఎస్‌ఎంఎస్‌ చేయవచ్చు. అదనపు సమాచారం కోసం జీవన్‌ ప్రమాణ్‌ హెల్ప్‌ డెస్క్‌ 1800111555ను సంప్రదించే అవకాశం కూడా ఉంది.

డిజిటల్‌ సేవలు ఆధార్‌ అనుసంధానంగా జరుగుతాయి. బయోమెట్రిక్‌, ఐరిస్‌ విధానంలో డిజిటల్‌ లైవ్‌ (జీవన్‌ ప్రమాణ్‌) సర్టిఫికెట్‌ జారీ చేస్తున్నారు. ఈ సేవలను పెన్షనర్లకు అందించేందుకు ఉమ్మడి జిల్లాలోని మీసేవ కేంద్రాలకు సైతం అవకాశం కల్పించారు. దీంతో పాటు పెన్షనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు సెల్‌ఫోన్ల ద్వారా జీవన్‌ ప్రమాణ్‌ సర్టిఫికెట్లను నమోదు చేస్తున్నారు. సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్ల వద్దకు వెళ్లి బొటన వేలి ముద్ర ద్వారా వివరాలు నమోదు చేసుకుని జీవన్‌ ప్రమాణ్‌ గుర్తింపు సంఖ్య పొందవచ్చు.

ఏటా నవంబర్‌లో పెన్షనర్లు జీవించి ఉన్నట్లుగా సంబంధిత అధికారి ముందు హాజరై లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలి. కానీ గ్రామాలు, పిల్లల వద్ద శేష జీవితం గడిపే పెన్షనర్లు బ్యాంకులకు రావడం ఇబ్బంది మారుతోంది. ఈ నేపథ్యాన సర్టిఫికెట్‌ సమర్పించే విషయంలో కేంద్రప్రభుత్వం ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. పెన్షనర్లు ఉన్న చోట

నుంచే డిజిటల్‌ సర్టిఫికెట్‌ తీసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement