పని పూర్తి చేయకుండానే బిల్లుల కోసం ఒత్తిడి | - | Sakshi
Sakshi News home page

పని పూర్తి చేయకుండానే బిల్లుల కోసం ఒత్తిడి

Oct 31 2026 6:08 AM | Updated on Oct 31 2026 6:08 AM

ఖమ్మంరూరల్‌: పనులు పూర్తిచేయడకుండానే బిల్లుల కోసం ఒత్తిడి చేస్తూ, నిబంధనల ప్రకారం వ్యవహరించిన అధికారులపై కాంట్రాక్టర్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విద్యుత్‌ శాఖ ఖమ్మంరూరల్‌ డీఈ సీహెచ్‌.నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి రూరల్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు రాకుండా పెద్ద లైన్‌ మార్పు పనుల కోసం రూ.37 లక్షలతో అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. చిన్న వెంకటగిరిలో ఆరు టవర్లు, చిన్నతండాలో నాలుగు టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, చిన్నతండాలో రెండు టవర్లే వదిలేశారని చెప్పారు. అంతేకాక వేసిన టవర్లకు కూడా వైర్లు లాగలేదన్నారు. నిబంధనల ప్రకారం పనులన్నీ చేశాకే బిల్లులు సమర్పించాలని కాంట్రాక్టర్‌కు సూచించినా, తాము సహకరించడం లేదని ఆరోపించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో ఏఈ కోక్యానాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement