కామేపల్లి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యాపారి మృతి చెందగా, పుట్టెదు దుంఖంలోనూ ఆయన కుటుంబీకులు వ్యాపారి అవయవాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. మండలంలోని పండితాపురం గ్రామానికి చెందిన వ్యాపారి ఇంజం నాగేశ్వరరావు(57) ఇటీవల ఖమ్మంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఖమ్మంలో, ఆతర్వాత హైదరాబాద్‌లో చికిత్స చేయిస్తుండగా బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు బుధవారం నిర్ధారించారు. దీంతో ఆయన సజీవంగా నిలిచిపోవాలనే భావనతో కుటుంబ సభ్యులు అవయవ దానం చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈమేరకు జీవన్‌దాన్ బృందం ఆయన ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఇతర అవయవాలను సేకరించింది. కాగా, నాగేశ్వరరావు భార్య విజయలక్ష్మి కొణిజర్ల మండలం లాలాపురం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు కాగా, వీరికి ఓ కుమారుడు ఉన్నాడు.
రేపు ఉపాధ్యాయులకు శిక్షణ
ఖమ్మం సహకారనగర్: డీఎస్సీ–2024 ద్వారా స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ)లుగా ఎంపికై న ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు జన విజ్ఞానవేదిక ఆధ్వర్యాన శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.వీ.రమేష్, అలవాల నాగేందర్ తెలిపారు. ‘లో కాస్ట్–నో కాస్ట్’ విధానంలో ప్రయోగాలు చేసే విధానంపై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఖమ్మంలోని రిక్కాబజార్ హైస్కూల్లో 30వ తేదీన ఉదయం 10 గంటలకు మొదలయ్యే శిక్షణను వినియోగించుకోవాలని కోరారు.
వ్యాపారి అవయవాలు
దానం చేసిన కుటుంబం


