పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Sep 22 2026 12:30 AM | Updated on Sep 22 2026 12:30 AM

ఎస్‌బీఐ రీజనల్‌ మేనేజర్‌ రామమూర్తి

ఖమ్మంగాంధీచౌక్‌: స్వచ్ఛతా హీ సేవ, గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రతీఒక్కరు మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖమ్మం రీజినల్‌ మేనేజర్‌ ఎం.రామమూర్తి పిలుపునిచ్చారు. ఖమ్మంలోని జెడ్పీబ్రాంచ్‌ ఆవరణలో మేనేజర్‌ షేక్‌ ఇబ్రహీం ఆధ్వర్యాన సోమవారం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎం రామమూర్తి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం పెంపునకు అందరూ సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ మేనేజర్లు రాంభరన్‌, శ్రీలక్ష్మి, ఉద్యోగులు, ఖాతాదారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement