అనుమతి పత్రాల ట్యాంపరింగ్
● సామిల్లులే అడ్డాగా దందా ● స్మగ్లర్లతో వ్యాపారుల లోపాయికారీ ఒప్పందాలు ● సమాచారం ఉన్నా నిలువరించలేని స్థితిలో అటవీ శాఖ
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో అక్రమ కలప దందా యథేచ్ఛగా సాగుతోంది. సా మిల్లులే దందాకు అడ్డాలుగా మారడం.. వ్యాపారుల అండదండలతో స్మగ్ల ర్లు చెలరేగిపోతున్నారని తెలుస్తోంది. అడవులు, బీడు భూములు, వ్యవసాయ భూముల్లోని వేప, తుమ్మ, దిరిశె వంటి జాతుల కలపను అనుమతి లేకుండానే రవాణా చేస్తున్నారు. కలప రవాణాకు ఎన్‌ఓసీ(నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్)తో పాటు పర్మిట్ ఉండాలి. ఈ సమయాన కలప ఆధారంగా చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ అనుమతులు తీసుకోకుండా, చార్జీల చెల్లించకుండా చెట్లను నరికి దుంగలుగా మార్చి అక్రమమార్గంలో యథేచ్ఛగా తరలిస్తున్నారు.
మొదటి మిల్లు.. ఆపై బయటకు..
కలప దందాకు స్మగ్లర్లు సా మిల్లులను అడ్డాలుగా మార్చుకుంటున్నారని తెలిసింది. అడవులు, బీడు భూములు, రైతుల భూముల్లోని వేప, తుమ్మ, దిరిశె వంటి చెట్లను నరికి పర్మిట్లు, ఎన్‌ఓసీ లేకుండా దొడ్డిదారిన మిల్లులకు తరలిస్తున్నారు. జిల్లాలో 250 వరకు సా మిల్లులు ఉండగా, ఖమ్మం నగర పరిసరాల్లోనే వందకు పైగా ఉంటాయి. తొలుత కలపను స్మగ్లర్లు మిల్లులకు చేర్చాక కలప రూపురేఖలు మార్చేస్తున్నారు. ఆపై మిల్లుల్లో అప్పటికే పర్మిట్ ఉన్న కలపలో కలిపేసి గృహ నిర్మాణాలు, ఇతర అవసరాలకు విక్రయిస్తున్నారు. ఈ తంతు కొత్తదేమీ కాకున్నా అధికారుల పట్టింపు లేనితనంతో నానాటికీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
ముందస్తు అవగాహన
సా మిల్లుల యాజమాన్యాలు, కలప వ్యాపారుల సహకారంతోనే స్మగ్లర్లు అక్రమ రవాణాకు తెగబడుతున్నారని సమాచారం. వ్యాపారులు ముందే స్మగ్లర్లతో ఒప్పందం కుదుర్చుకుని కలప తరలింపునకు వాహనాలు సైతం సమకూరుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈమేకు కలపను సా మిల్లులకు తీసుకురాగానే రూపురేఖలు మార్చేసి అమ్మాక ఆ కలప డిమాండ్, ధర ఆధారంగా వాటాలు పంచుకుంటారు. ఈక్రమాన ఆయా ప్రాంతాల్లో పనిచేసే అటవీ శాఖ ఉద్యోగులకు ఎంతో కొంత ముట్టచెప్పి తమ జోలికి రాకుండా చూసుకుంటున్నారని సమాచారం.
నల్లతుమ్మకు బదులు
‘సండ్ర’ తరలించిన ఇద్దరి అరెస్ట్
8లో...


