టీచర్లకూ పాఠాలు ! | - | Sakshi
Sakshi News home page

టీచర్లకూ పాఠాలు !

Aug 17 2026 12:11 AM | Updated on Aug 17 2026 12:11 AM

విద్యార్థులకు నాణ్యమైన విద్య.. విజయవంతంగా శిక్షణ..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధే లక్ష్యం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో పూర్తి

ప్రయోజనకరంగా ఉంది..

ఖమ్మంసహకారనగర్‌: మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాల్లోనూ మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. అంతేకాక ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి పోటీ తట్టుకోవడానికి ప్రభుత్వ పాఠశాలల్లోనూ డిజిటల్‌ బోధన అమలు చేస్తున్నారు. ఈనేపథ్యాన విద్యార్థులకు మెరుగైన బోధన అందించేలా ఉపాధ్యాయులకు ఏటా పది రోజుల పాటు విద్యాశాఖ శిక్షణ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా రాష్ట్ర, జిల్లాస్థాయితో పాటు మండల స్థాయిలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తయింది.

బోధన పద్ధతులపై..

తొలి దశలో జిల్లా నుంచి ఎంపిక చేసిన నలుగురు రిసోర్స్‌ పర్సన్ల(ఆర్‌పీ)కు వృత్యంతర శిక్షణ హైదరాబాద్‌లో అందించారు. వీరు జిల్లా స్థాయిలో ఆర్‌పీలకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఆర్‌పీలు మండల స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరాల్లో బోధనా పద్ధతులపై అవగాహన కల్పించారు. మారుతున్న బోధన విధానం, విద్యార్థుల స్థాయి ఆధారంగా బోధన అభ్యసన ప్రక్రియలు, ప్రణాళికల రూపకల్పన, టీచింగ్‌ డైరీలు రాయడం, సబ్జెక్టు వారీగా అభ్యసన ఫలితాలు మెరుగుపర్చడం తదితర అంశాలపై ఈ శిక్షణ కొనసాగింది.

అన్ని స్థాయిల్లో..

జిల్లాలో సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులకే కాక స్పెషల్‌ ఎడ్యుకేటర్లు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, ఉర్దూ టీచర్లకు సైతం శిక్షణ పూర్తయింది. ఆపై ఖమ్మం డైట్‌లో ప్రధానోపాధ్యాయులు, ఫిజికల్‌ డైరెక్టర్లు, పీఈటీలకు కూడా శిక్షణ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డైట్‌ సమీపంలోని టేకులపల్లి గురుకులంలో ఏడు రోజుల వృత్యంతర శిక్షణ ఇవ్వగా, ఇతర వేదికల్లో మిగతా ఉపాధ్యాయులకు శిక్షణ కొనసాగించారు.

ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. మారుతున్న పద్ధతులపై టీచర్లకు అవగాహన ఏర్పడి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేయడం ద్వారా ఫలితాలు మెరుగ్గా వస్తాయి.

– పెసర ప్రభాకర్‌రెడ్డి, విద్యాశాఖ ఏఎంఓ

ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. జిల్లాస్థాయిలో 13 కేటగిరీల్లో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర విద్య శిక్షణ పరిశోధన మండలి సంయుక్త ఆధ్వర్యాన వృత్యంతర శిక్షణ కొనసాగింది.

– సదానందం, జిల్లా విద్యాశాఖాధికారి

బోధనలో మెళకువలపై శిక్షణ

వృత్యంతర శిక్షణ ప్రయోజనకరంగా ఉంది. ప్రతీ విద్యార్థిని అసెస్‌ చేయడం ద్వారా అభ్యసన సామరా్‌థ్య్‌లను గుర్తించి బోధనలో మార్పు చేసుకోవచ్చు. తద్వారా తరగతి గదిలోని విద్యార్థులంతా ప్రగతి సాధించే అవకాశముంటుంది.

– దుగ్గిరాల శోభన, గణితం, జెడ్పీహెచ్‌ఎస్‌,

తిరుమలాయపాలెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement