ఖమ్మంక్రైం: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే సమయాలను గుర్తించి తనిఖీలు చేపట్టాలని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. ఖమ్మంలో గురువారం జరిగిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టేషన్ల వారీగా అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు. అలాగే, డ్రగ్స్ మహమ్మారిని జిల్లా నుంచి తరిమేసేలా విద్యాసంస్థల్లో సదస్సులు నిర్వహించాలని సూచించారు. అంతేకాక పిల్లలు సైబర్ నేరగాళ్ల బారిన పడడంతో పాటు లైంగిక వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. తద్వారా పోక్సో కేసులు పెరుగుతున్నందున పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు జాగ్రత్త వహించేలా అవగాహ న కల్పించాలన్నారు. అలాగే, చోరీ కేసుల దర్యాప్తు, సొత్తు రికవరీ, రాత్రి వేళ గస్తీ తదితర అంశాలపై సీపీ సూచనలు చేశారు. ఈసమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు వసుంధరయాదవ్, రమణమూర్తి, తిరుపతిరెడ్డి, సారంగపాణి, నరసింహారావు, మహేష్, సాంబరాజు, సత్యనారాయణ, సర్వర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
పోలీసు కమిషనర్ సునీల్‌దత్


