ఖమ్మంమయూరిసెంటర్: హల్ద్వానీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై జరిగిన అవమానకర చర్య ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు నూతి సత్యనారాయణగౌడ్, నాగండ్ల దీపక్‌చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు ఖమ్మంలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగగా వారు మాట్లాడుతూ హల్ద్వానీలో కాంగ్రెస్ ర్యాలీ జరిగిన ప్రదేశంలో హిందూ మితవాద సంస్థలు గంగాజలంతో శుద్ధీకరణ పేరుతో చేపట్టిన చర్య అత్యంత హేయనీయమని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షులు దళిత సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతోనే ఇలా చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగులు, సుడా, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహ్మద్ ఖాదర్‌బాబా, నాయకులు దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, బొడ్డు బొందయ్య, ముక్తార్ జోహారా, కమర్తపు మురళి, కన్నం వైష్ణవి ప్రసన్న, రావూరి సైదుబాబు, బాలాజీనాయక్, రంగా జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ జిల్లా నగర అధ్యక్షులు
సత్యనారాయణ, దీపక్‌చౌదరి


