రైతులకు ఉచిత న్యాయ సాయం | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఉచిత న్యాయ సాయం

Aug 15 2026 12:10 AM | Updated on Aug 15 2026 12:10 AM

కామేపల్లి: రైతులు న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు అగ్రిలీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌లు, డీఎల్‌ఎస్‌ఏ ద్వారా ఉచిత న్యాయ సాయం పొందొచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.దేవీమానస పేర్కొన్నారు. కామేపల్లి మండలం ముచ్చర్లలోని రైతువేదికలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి దేవీమానస వ్యవసాయ సంబంధిత చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రుణాలు, రైతులకు అందుబాటులో ఉన్న న్యాయపరమైన రక్షణపై అవగాహన కల్పించారు. భూమి హక్కుల రికార్డులు, సరిహద్దు వివాదాలు, ప్రాజెక్టుల కోసం భూమి సేకరించినప్పుడు పరిహారం, హక్కుల వివరాలు తెలియచేయడమే కాక నకిలీ విత్తనాలు, ఇతర కారణాలతో పంట నష్టపోతే పరిహారం పొందే విధానాన్ని వివరించారు. ఆర్థిక సోమత లేని రైతులకు ఉచితంగా న్యాయవాదిని కేటాయిస్తామని తెలిపారు. ఈ సదస్సులో తహసీల్దార్‌ శ్రీనివాసరావు, ఎస్సై శ్రీకాంత్‌, సర్పంచ్‌ జాటోత్‌ జాయ్‌లూసీ, పారా లీగల్‌ వలంటీర్లు పాల్గొన్నారు.

సింగరేణిలో 16మంది ఉత్తమ ఉద్యోగుల ఎంపిక

రుద్రంపూర్‌: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా సింగరేణి యాజమాన్యం సంస్థ వ్యాప్తంగా 12 ఏరియాల నుంచి ఉత్తమ ఉద్యోగులు, అధికారులను ఎంపిక చేసింది. వీరిని కొత్తగూడెంలో జరిగే వేడుకల్లో శనివారం సీఎండీ బుద్దప్రకాశ్‌ జ్యోతి సన్మానించనున్నారు. మొత్తం 16మంది ఎంపిక చేయగా, వీరిలో కొత్తగూడెం రీజియన్‌ నుంచి ఏడుగురు ఉన్నా రు. ఇందులో పి.మధుసూదన్‌రావు(పీకేఓసీ–2, మణుగూరు ఏరియా), జీ.ఏ.శ్రీనివాసరావు(కోయగూడెం ఓసీ, ఇల్లెందు ఏరియా), జక్కుల గట్టయ్య(ఆర్‌సీహెచ్‌పీ, కొత్తగూడెం ఏరియా), కె.శ్రీధర్‌(జేవీఆర్‌ ఓసీ సత్తుపల్లి ఏరియా), సీహెచ్‌.సూర్యనారాయణశర్మ(ఇంటర్నల్‌ ఆడిట్‌, కార్పొరేట్‌ ఏరియా), అధికా రు ల విభాగంలో ఏ.మనోహర్‌(జీఎం, కార్పొరేట్‌ ఏరియా), ఎన్‌.చక్రవర్తి(జీఎం, కార్పొరేట్‌ ఏరి యా) ఎంపికయ్యారు. వీరితో పాటు ఇతర ఏరి యాల నుంచి మిగతా వారు ఉన్నారు. కాగా, సింగరేణిలో 50 విభాగాలు ఉండగా, 12 విభా గాల నుంచే ఉత్తమ కార్మికులు, ఉద్యోగులను ఎంపిక చేయడాన్ని పలువురు తప్పుపట్టారు.

అనుమతి లేకుండా

ఏపీకి మట్టి తరలింపు

వాహనాలను అడ్డుకున్న రైతులు

నేలకొండపల్లి: జిల్లా నుంచి అనుమతి లేకుండా ఏపీకి మట్టి తరలిస్తున్న కొందరు అక్కడ అమ్మి సొమ్ము చేసుకంటున్నారు. ఈ విషయం తెలిసినా ఎవరూ స్పందించకపోవడంతో ఆగ్రహించిన రైతులు వాహనాలను అడ్డుకున్నారు. నేలకొండపల్లి మండలం కట్టుకాచారాం గ్రామం నుంచి కొద్దిరోజులుగా ఏపీకి చెందిన కాంట్రాక్టర్లు అనుమతి లేకుండా వాహనాల్లో మట్టి తరలిస్తున్నారు. ఈ ప్రాంతం హైదరాబాద్‌ – విజయవా డ హైవేకు కేవలం రెండు కి.మీ. దూరాన ఉండడంతో రాత్రి వేళ ఏపీలోని ఎన్‌టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడు మీదుగా మట్టి తరలిస్తున్నారని తెలిసింది. ఈక్రమాన శుక్రవారం రాత్రి స్థానికులు కొందరు నిలదీయడంతో తమకు అనుమతి ఉందని దౌర్జన్యానికి దిగారు. దీంతో స్థానిక రైతులు పెద్దసంఖ్యలో శుక్రవారం రాత్రి చేరుకుని వాహనాలను అడ్డగించారు. టిప్పర్లను సీజ్‌ చేసి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు కదిలేదని లేదని స్పష్టం చేశారు. రైతుల ఆందోళనతోనైనా అధికారులు స్పందిస్తారో, లేదో వేచిచూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement