ఖమ్మంఅర్బన్: బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ ఎలక్ట్రిక్ వైర్ల విక్రయాలు సాగుతున్నాయనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్, ఖమ్మం అర్బన్ పోలీసులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఖమ్మం ప్రశాంతినగర్‌లోని ఓ గోదాంలో భారీగా నకిలీ వైర్లను స్వాధీనం చేసుకోగా, వ్యాపారి పరారైనట్లు సమాచారం. అక్కడ పనిచేస్తున్న రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు, రఘునాథపాలెం మండలం కొర్లబోడుతండాకు చెందిన అనిల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
బ్రాండెడ్ బాక్సుల్లో ప్యాకింగ్
శానిటరీ సామగ్రి నిల్వ పేరిట శ్రాంతినగర్‌లోని గోదామును రాజస్థాన్‌కు చెందిన వ్యాపారి కొంతకాలం క్రితం అద్దెకు తీసుకున్నాడు. ఇక్కడ నకిలీ, నాసిరకం వైర్లను తెప్పించి బ్రాండెడ్ కంపెనీల బాక్సుల్లో ప్యాక్ చేయించి అమ్ముతున్నట్లు తెలిసింది. గోల్డ్‌మెడల్ కంపెనీ పేరుతో నకిలీ వైర్లను ఎలక్ట్రీషియన్ల ద్వారా ఇళ్ల యజమానులకు విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ, ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ ఆధ్వర్యాన తనిఖీ చేయగా గుట్టురట్టయింది. అయితే, దందా ఎప్పటి నుంచి కొనసాగుతోంది, నిర్వాహకులెవరనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
టాస్క్‌ఫోర్స్, అర్బన్ పోలీసుల
తనిఖీల్లో గుర్తింపు


