ఖమ్మంవ్యవసాయం: ఎరువుల కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’(ఎఫ్‌ఎఫ్‌ఎస్) డిజిటల్ విధానం జిల్లాలో శుక్రవారం అమల్లోకి వచ్చింది. పలు రకాల ఎరువులను రైతులకు సబ్సిడీపై ఇస్తుండగా అక్రమాలు చోటు చేసుకుంటుండడం, అంతర్జాతీయ పరిణామాలతో కొరత ఏర్పడడంతో చెక్ పెట్టేలా కేంద్రం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో యూరియా, డీఏపీతో పాటు పలు రకాల కాంప్లెక్స్, ఇతర ఎరువులన్నీ ఈ విధానంలోనే బుక్ చేసి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో తొలిదశగా పది జిల్లాలో అమలుచేస్తుండగా, జాబితాలో జిల్లా కూడా ఉంది. జీఎఫ్‌ఆర్(జనరల్ ఫెర్టిలైజర్ రికమండ్) విధానంలో ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ను అమలు చేస్తూ రైతులు సాగు చేసే పంటల ఆధారంగా ఎరువులను పంపిణీ చేస్తున్నారు. తొలిరోజు ఎఫ్‌ఎఫ్‌ఎస్ విధానంలో 7,772 మంది రైతులకు ఎరువులను విక్రయించారు. పలు ప్రాంతాల్లో ఎరువుల పంపిణీని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు.
తొలిరోజు వినియోగించుకున్న
7,772 మంది రైతులు


