ఖమ్మం వైద్యవిభాగం: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్‌సీడీసీ) కన్సల్టెంట్ డాక్టర్ సామ్‌జాన్ బృందం గురువారం జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని జిల్లా ల్యాబ్‌లో జరుగుతున్న పరీక్షలు, రికార్డులను పరిశీలించారు. అలాగే, మామిళ్లగూడెం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు. అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సామ్‌జాన్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అత్యంత సమర్థవంతంగా అమలవుతుండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా వ్యాక్సిన్ల ద్వారా నివారించదగిన వ్యాధుల నియంత్రణను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐడీఎస్‌పీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మోథ్యా, వివిధ విభాగాల అధికారులు డాక్టర్ అరుణాదేవి, డాక్టర్ సాయికుమార్, ఉద్యోగులు కృష్ణమోహన్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌సీడీసీ కన్సల్టెంట్
డాక్టర్ సామ్‌జాన్ అభినందన


