ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి సోమవారం కిటకిటలాడింది. వాతావరణంలో మార్పులతో వ్యాధుల వ్యాప్తి పెరగగా.. పలువురు జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి తోడు వారాంతపు సెలవులు రావడంతో సోమవారం ఉదయం 8 గంటల నుంచే ఓపీ విభాగం వద్ద క్యూ నెలకొంది. జనరల్ ఆస్పత్రితో పాటు మాతా శిశు ఆరోగ్య కేంద్రలో కూడా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల రద్దీ కనిపించింది. ఆస్పత్రిలో ఈ ఒక్కరోజు మొత్తం 2,500 మంది వరకు వివిధ రకాల వైద్యసేవలు పొందారని అధికారులు తెలిపారు. ఒకేరోజు ఎక్కువ మంది రావడంతో వృద్ధులు, గర్భిణులు ఇబ్బంది పడ్డారు. ఓపీ చీటీ తీసుకుని పరీక్ష చేయించుకునేందుకు చాలా సమయం నిరీక్షించాల్సి వచ్చింది.


