విద్యార్థుల అభ్యున్నతే ధ్యేయం కావాలి
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల అభ్యున్నతే ధ్యేయంగా ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో కృషిచేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశె ట్టి సూచించారు. సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో శనివారం జిల్లా విద్యాశా ఖ ఆధ్వర్యాన మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి సావిత్రిబాయి పూలే చిత్రపటం వద్ద నివాళులర్పించాక కలెక్టర్ మాట్లాడారు. కుల, మత, వర్ణ వివక్షత ఉన్న రోజుల్లోనే బాలికల చదువు కోసం సావిత్రీబాయి కృషి చేశారని గుర్తుచేశారు. ఈమేరకు ప్రస్తుత ఉపాధ్యాయులు పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దేలా బోధించాలని సూచించారు. అనంతరం పలువురు మహిళా ఉపాధ్యాయులను సత్కరించారు. డీఈఓ చైతన్యజైనీ, ఉద్యోగులు శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రభాకర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, రూబీ, ఎంఈఓలు పాల్గొన్నారు.
●కారేపల్లి: కారేపల్లి మండలం బీక్యాతండాకు చెందిన మాలోతు మంజుల కామేపల్లి గిరిజన సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయంలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా ఆమెకు ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు ప్రకటించగా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి చేతుల మీదుగా అందుకున్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
విద్యార్థుల అభ్యున్నతే ధ్యేయం కావాలి


