న్యాయ సలహాదారుడిగా వెంకటగుప్తా
ఖమ్మం లీగల్: జిల్లా నుంచి కేంద్ర ప్రభుత్వం న్యాయ సలహా దారుడిగా వెంకట గుప్తా నియమితులయ్యారు. ఈమేరకు న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఖమ్మం కోర్టులో 1992 నుంచి న్యాయవాదిగా పనిచేస్తున్న వెంకటగుప్తా వివిధ బ్యాంకులకు అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్నారు. అలా గే, న్యాయవాద పరిషత్‌కు జిల్లా కార్యదర్శిగా ఉన్నా రు. కాగా, కేంద్ర ప్రభుత్వ న్యాయ సలహాదారుడిగా ఆయనతో పాటు సహాయ న్యాయ సలహాదారులుగా శేఖర్‌రాజు, శ్రీనివాసశర్మ, ఆమనగంటి వెంకటరమణ, కొండపల్లి విజయకుమార్, చరణ్, గండ్ర దీన్‌దయాళ్ నియమితులయ్యారు.
వేర్వేరు ఘటనల్లో
ఆరుగురిపై కేసు
చింతకాని: మండలంలోని బస్వాపురానికి గ్రామానికి చెందిన పొట్టపల్లి కన్నయ్య, లాలమ్మ, భాస్కర్, దొంతగాని రాంబాబు, కుక్కల సైదులుపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన పొట్టపల్లి ధనలక్ష్మికి చెందిన ఇంటి స్థలం విషయంలో వీరు గొడవ పడి ఇంట్లోని విద్యుత్ మోటార్‌ను ధ్వంసం చేశారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. అలాగే, మండలంలోని పందిళ్లపల్లికి చెందిన అలవాల పుష్ప ఇంట్లో చోరీకి యత్నించిన రామకృష్ణాపురానికి చెందిన గాదె పద్మ పట్టుబడగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.


