విజయోత్సవ ర్యాలీలో ఘర్షణ
బోనకల్: మండలంలోని ఆళ్లపాడు గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన విజయోత్సవ ర్యాలీలో గొడవ జరగగా ముగ్గురికి గాయాలయ్యాయి. సీపీఎం మద్దతుతో బీఆర్‌ఎస్ అభ్యర్థి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈమేరకు ప్రమాణస్వీకారం అనంతరం ర్యాలీ నిర్వహించే క్రమాన కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లాది లింగయ్య ఇంటి ముందు కుంకుమ చల్లుకోవడంతోపాటు వారి ఇంటి ఆవరణలో కుంకుమ చల్లారని తెలిసింది. ఈ క్రమాన ఘర్షణ మొదలుకాగా సీపీఎం, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన చెన్నకేశ వేణుతోపాటు శ్రీకాంత్, పవన్ గాయపడడంతో ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై మంగళవారం ఫిర్యాదు అందిందని ఎస్సై పి.వెంకన్న తెలిపారు. కాగా, గాయపడ్డ వారిని జెడ్పీమాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, నాయకులు పరామర్శించారు.


