సన్మానం పేరిట ఆహ్వానం
వైరా: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున వైరా మండలంలో 20మంది సర్పంచ్‌లుగా గెలిచారు. వీరిని వైరాలోని కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం సన్మానిస్తారని మండల నాయకులు ప్రకటించారు. ఈమేరకు పార్టీ కార్యాలయానికి ఆహ్వానించగా సర్పంచ్‌లంతా చేరుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి వేచి చూస్తుండగా మధ్యాహ్నం 3గంటల సమయాన డిప్యూటీ సీఎం భట్టి వైరా చేరుకున్నప్పటికీ కార్యాలయంలోకి రాకుండానే నిమిషం పాటు బయట ఆగి వెళ్లి పోయారు. దీంతో సర్పంచ్‌లంతా నిరాశగా వెను దిరిగారు. సన్మానం ఉంటుందని పిలిచి తమను ఎందుకు అవమానించారని నాయకులపై అసహనం వ్యక్తం చేశారు.
డిప్యూటీ సీఎం రాకపోవడంతో నిరుత్సాహం


