విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు
తనిఖీలు ముమ్మరం చేస్తాం..
● క్వార్టర్‌పై అదనంగా రూ.40 వసూళ్లు ● పల్లెల్లో వివాదాలకు కారణమవుతున్న వైనం ● అయినా పట్టించుకోని ఎకై ్సజ్ శాఖాధికారులు
నేలకొండపల్లి: అధికారిక దుకాణాలు కావు... అయినా 24 గంటల మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. రహదారుల వెంట, గ్రామాల్లోని కిరాణం, ఇతర షాపుల్లో కొనసాగుతున్న వీటి కారణంగా మందుబాబులకు నిత్యం మద్యం లభిస్తుండడంతో తాగి గొడవ పడుతున్నారు. ఇక షాపుల నిర్వాహకులు వైన్స్ నుంచి క్వార్టర్‌పై రూ.10నుంచి రూ.20 వరకు ఎక్కువతో కొనుగోలు చేసి తీసుకొస్తూ గ్రామాల్లో ఎమ్మార్పీ కంటే రూ.40 పెంచి అమ్ముతున్నారు. నేలకొండపల్లి ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో దాదాపు అన్నిచోట్ల ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ఎకై ్సజ్ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
ప్రతీ గ్రామం, తండాల్లో...
ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో మద్యం అమ్మకాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సర్కిల్ పరిధిలో ప్రతీ గ్రామం, తండాలో కనీసం మూడుకు పైగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. బడ్డీకొట్టు, కిరాణం షాప్, హోటల్ ఇలా అనువుగా ఉన్న ప్రతీచోట 24గంటల పాటు మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయాన వ్యాపారులను బైండోవర్ చేసినా రూ.లక్షల విలువైన మద్యం విక్రయాలు జరిగాయంటే ఎకై ్సజ్ అధికారుల పనితీరును అర్థం చేసుకోవచ్చు. రోజంతా మద్యం లభిస్తుండడంతో అదనంగా వెచ్చించి మరీ కొనుగోలు చేస్తున్న మందుబాబులు జేబులు గుల్ల చేసుకుంటున్నారు. వీరి కారణంగా గ్రామాల్లో తరచుగా ఘర్షణలు కూడా జరుగుతున్నాయి.
అదనపు వసూళ్లు
బెల్ట్‌షాపుల నిర్వాహకుల నుంచి నేలకొండపల్లిలో ని వైన్స్ బాధ్యులు రూ.110 ఉన్న క్వార్టర్‌కు రూ. 130 వసూలు చేస్తున్నారని తెలిసింది. ఇకబెల్ట్ షాపుల్లో ఇదేక్వార్టర్‌ను రూ.150కి అమ్ముతున్నారు. అలా గే, బీర్లపైనా ధర పెంచుతుండగా ప్రతీరోజు బెల్ట్‌షాపులకు విక్రయించే మద్యం నుంచే వైన్స్ నిర్వాహకులు రూ.లక్షల మేర దండుకుంటున్నారు. నేలకొండపల్లిమండల కేంద్రంలో బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా చేసేందుకు రెండు వైన్స్‌ను కేటా యించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా ఎకై ్సజ్ అధికారులు తనిఖీల మాటెత్తకపోవడం గమనార్హం.
గుప్పుమంటున్న గుడుంబా
పలు మండలాల్లో ఇటీవల గుడుంబా తయారీ, అమ్మకాలు జోరందుకున్నాయనే ప్రచారం జరుగుతోంది. గ్రామాలు, తండాల్లో గుడుంబా విక్రయాలు సాగుతున్నట్లు సమాచారం. నేలకొండపల్లి ఎకై ్సజ్ స్టేషన్‌కు ఆక్టోబర్ నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్ సీఐ లేకపోవడంతో అటు బెల్ట్‌షాపులు, ఇటు గుడుంబా విక్రయాలపై ఉద్యోగులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
నేలకొండపల్లి సర్కిల్ పరిధిలో బెల్ట్ షాపులను కట్టడి చేసేలా తనిఖీలు నిర్వహిస్తాం. వైన్స్ ద్వారా హోల్‌సేల్‌గా మద్యం అమ్మకాలు జరగకుండా కట్టడి చేస్తాం. ఎవరైనా ఎమ్మార్పీకి మించి ధర పెంచినట్లే తెలిస్తే కేసులు నమోదు చేస్తాం.
– రమేష్, ఇన్‌చార్జ్ ఎకై ్సజ్ సీఐ, నేలకొండపల్లి


