బకాయిలకు మోక్షం..
● స్కాలర్‌షిప్‌ల చెల్లింపునకు నిధులు ● జిల్లాలో బకాయిలు రూ.58.46 కోట్లు
ఖమ్మంమయూరిసెంటర్: వేలాదిమంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపకార వేతనాల విడుదలకు మార్గం సుగమమైంది. ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిలను మంజూరు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించడంతో విద్యార్థి లోకంలో హ ర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత విద్య చది వే విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు ఆసరాగా నిలుస్తుండగా, ఏళ్ల తరబడి పెండింగ్ ఉండడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేసిన ప్రకటనతో జిల్లాలోని నిరుపేద విద్యార్థులకు ఊరట లభించనుంది.
గత ప్రభుత్వ హయాం నుంచి..
గత ప్రభుత్వ హయాం నుండి విద్యార్థులకు మెస్ చార్జీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో విడుదల కాక విద్యార్థులు అవస్థ పడుతున్నారు. ము ఖ్యంగా ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల పై యాజమాన్యాలుఫీజుకోసం ఒత్తిడి చేస్తుండడంపై, సర్టిఫికెట్లు ఆపివేయడం వంటి పరిణామాలతో భవి ష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఇప్పుడు ప్రభుత్వం ఉపకారవేతనాల బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విద్యార్థుల్లో ఊరట నెలకొంది.
జిల్లాలో వేలాది మంది...
ఖమ్మం జిల్లాలో వందలాది విద్యాసంస్థలు ఉన్నా యి. వేలాది మంది విద్యార్థులు ఇంటర్ నుండి ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ కోర్సుల వరకు చదువుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన సుమారు లక్ష మంది విద్యార్థులు ఉండగా, 2022 ఏడాది నుండి ఉపకార వేతనా లు నిలిచిపోయాయి. ఇప్పుడు బకాయిలన్నీ ప్రభుత్వం విడుదల చేయనుందని అధికారులు చెబుతున్నారు.
మూడేళ్లలో..
2022–23 ఏడాదినుండి విద్యార్థులకు ఉపకార వేతనాలు విడుదల కావడంలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఉపకార వేతనాలు ఎంతో ఆసరాగా నిలుస్తాయి. కానీ మూడేళ్ల నుంచి విడుదల కాక జిల్లాలో రూ.58.46 కోట్ల మేర ఉపకార వేతనాల బకాయిలు పేరుకుపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నిధులు విడుదల కానుండడంతో విద్యార్థుల ఇక్కట్లు తీరనున్నాయి.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల నుంచి
ఉపకార వేతనాల బకాయిలు (రూ.కోట్లలో)
సంవత్సరం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ
2024–25 4.49 1.13 3.13 1.23
2023–24 9.01 4.35 6.82 1.56
2022–23 11.31 4.93 5.87 1.62
మొత్తం 24.82 10.42 18.82 4.41


