జాకబ్‌కు ఎమినెంట్ క్రిస్టియన్ అవార్డు
కొణిజర్ల: కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలోని గ్రేస్ విద్యాసంస్థల అధినేత, గ్రేస్ సర్వీస్ సొసైటీ చైర్మన్ ఎం.ఎం.జాకబ్‌కు ఎమినెంట్ క్రిస్టియన్ అవార్డు లభించింది. ఉత్తమ సేవలందిస్తున్న పలు క్రైస్తవ సంస్థలకు ప్రభుత్వం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని అవార్డులు ప్రకటించింది. ఈమేరకు హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జాకబ్ అవార్డు అందుకున్నా రు. వృద్ధులు, వితంతువులు, కుష్టు రోగులకు అందిస్తున్న సేవలు, నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య తదితర కార్యక్రమాలకు గాను అవార్డు లభించిందని జాకబ్ వెల్లడించగా, ఆయనను పలువురు అభినందించారు.
28న కవయిత్రి
ఓల్గాకు పౌరసన్మానం
ఖమ్మం మామిళ్లగూడెం: ప్రముఖ కవయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఓల్గాకు ఈనెల 28న పౌరసన్మానం ఏర్పాటుచేసినట్లు స్వేఛ్ఛావరణం నిర్వాహకురాలు సుమ తి తెలిపారు. ఖమ్మంలో మంగళవారం ఆమె మాట్లాడుతూ వేదిక ఫంక్షన్ హాల్‌లో జరిగే సన్మానంలో ప్రముఖ సాహితీ వేత్తలు మృణాళి ని, కాత్యాయని విద్మహే, ప్రతిమ, పాటిబండ్ల రజని తదితరులు హాజరవుతారని వెల్లడించా రు. తొలుత ‘ఓల్గా తీరం’ పుస్తకాన్ని ఆవిష్కరించనుండగా, ఆమెరచనలపై ఎగ్జిబిషన్ ఉంటుందని, నృత్యరూపకాన్ని కూడా ప్రదర్శించనునట్లు తెలిపారు. ఇప్పటికే ఓల్గా రచనలపై నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందచేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రచయిత్రి వురిమళ్ల సునంద తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ నిర్మాణ
స్థలం పరిశీలన
చింతకాని: చింతకాని మండలం మత్కేపల్లి పరిధిలో నిర్మించనున్న వ్యవసాయ మార్కెట్ నిర్మాణ స్థలాన్ని ఎజిలిటీ కంపెనీ ప్రతినిధులు మంగళవారం పరిశీలించారు. చింతకాని, ము దిగొండ మండలాలకు కలిపి మత్కేపల్లిలో మా ర్కెట్ మంజూరు చేయగా, సుమారు 20 ఎకరాల స్థలం అవసరమని గుర్తించారు. ఇందులో ఇప్పటివరకు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూ మిని మార్కెటింగ్ అధికారులకు అప్పగించా రు. మిగిలిన స్థలాన్ని కూడా అప్పగిస్తే నిర్మాణ పనులు ప్రారంభించటానికి అవకాశం ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వ ర్లు, వైస్ చైర్మన్ పర్చగాని తిరుపతిరావు, డైరెక్టర్ బందెల నాగార్జున్, జిల్లా మార్కెటింగ్ అధి కారి అలీమ్, ఎజిలిటి కంపెనీ ప్రతినిధి సురేష్ కుమార్ పాల్గొన్నారు.
జాతీయస్థాయి ఉషూ
పోటీలకు ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: జాతీయస్థాయి ఉషూ పోటీల కు ఖమ్మంక్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 25నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్‌లో జరిగే ఫెడరేషన్‌కప్ పోటీల్లో భాగంగా సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల నుంచి 15 మంది బాలబాలికలు హాజరుకానున్నారు. ఈమేరకు క్రీడాకారులు టి.సాయిభవ్యశ్రీ, టి.సాయిమహార్షి, డి.హర్షిణి, ఎస్.కే. పర్‌దోష్, ఎన్.చైతన్య, కె.సోహన్, వి.అభిషేక్, జి. లోకేష్, బి.హర్షవర్థన్, ఆర్.శ్రీమార్, ఎస్.కే. ఉమర్‌ఫారుఖీ, పి.పవిత్రాచారి, పి.సత్యజిత్‌చా రి, ఎస్.కే.నిహాన్‌పాషా, వై.చరణ్‌తేజ్ యా దవ్, వై.గౌరీశంకర్ యాదవ్‌ను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, కోచ్ పి.పరిపూర్ణాచారి అభినందించారు.
జాకబ్‌కు ఎమినెంట్ క్రిస్టియన్ అవార్డు
జాకబ్‌కు ఎమినెంట్ క్రిస్టియన్ అవార్డు


