ప్రకృతి అందాలు అద్భుతం
పాల్వంచరూరల్ : కిన్నెరసాని ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయని నలుగురు ట్రెయినీ ఐపీఎస్‌లు కితాబిచ్చారు. పాల్వంచ మండలం కిన్నెరసానిని మంగళవారం వారు సందర్శించారు. అభయారణ్యంలో జంతవుల సంరక్షణ, అటవీ సంపద వివరాలు తెలుసుకున్నారు. ఇక్కడ ప్రకృతి అందాలు ‘సో బ్యూటిఫుల్’ అంటూ పేర్కొన్నారు. ఐపీఎస్ శిక్షణలో భాగంగా తాము ఇక్కడికి వచ్చామని హైదరాబాద్‌కు చెందిన రాహుల్, మనీషా నెహరా, సోనమ్ సునీల్, ఆయేషా ఫాతిమా వెల్లడించారు. అనంతరం బోటు షికారు చేశారు. వారి వెంట పట్టణ ట్రాఫిక్ ఎస్‌ఐ జీవన్ ఉన్నారు.
కిన్నెరసానిని సందర్శించిన
ట్రెయినీ ఐపీఎస్‌లు


