‘ఉపాధి’ని నిర్వీర్యం చేసే కుట్ర
ఇప్పటికే నిధులు తగ్గించిన కేంద్రం
ఏఐసీసీ కార్యదర్శి,
తెలంగాణ ఇన్‌చార్జి విశ్వనాథన్
ఖమ్మంమయూరిసెంటర్: మహాత్మాగాంధీ పేరిట ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం పేరు మార్చిందని, తద్వారా గాంధీని మరోసారి హత్య చేశారని ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జి పి.విశ్వనాథన్ పేర్కొన్నారు. ఖమ్మంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలు, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిందని తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం నిధులను తగ్గించడమే కాక కొంత వాటా రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలన్న నిబంధనతో పేదలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలు భవిష్యత్ ఎన్నికలకు మంచి ఊతమిస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వాన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుతోందని ఆయన వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు వర్ధంతి నిర్వహించగా నాయకులు ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కాగా, కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్‌ను జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి, నాయకులు, ప్రజాప్రతినిధులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, తుమ్మల యుగంధర్, మద్దినేని బేబి స్వర్ణకుమారి, మలీదు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు, రాపర్తి శరత్‌కుమార్, శెట్టి రంగారావు, వడ్డెబోయిన నర్సింహరావు, దొబ్బల సౌజన్య, పుచ్చకాయల వీరభద్రం, మొక్క శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
●రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఏఐసీసీ కార్యదర్శి పి.విశ్వనాథన్ మంగళవారం సాయంత్రం ఖమ్మంలో కలిశారు. ఈ సందర్భంగా జిల్లా, రాష్ట్ర రాజకీయాలపై ఇరువురు చర్చించుకున్నారు.
●ఖమ్మంఅర్బన్: ఇటీవల ఎన్నికల్లో రఘునాథపాలెం మండలం నుంచి కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు మంగళవారం ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ కలిశారు. వీరిని అభినందించిన ఆయన ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు. మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావుతో పాటు దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.


