విశ్వకర్మ పథకాన్ని సంపూర్ణంగా అమలుచేయాలి
ఖమ్మం మామిళ్లగూడెం: బడుగు, బలహీనవర్గాల ప్రజల్లో వృత్తి నైపుణ్యాలను పెంచేలా కేంద్రప్రభుత్వం రూపొందించిన విశ్వకర్మ పథకాన్నిపూర్తిస్థాయిలో అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ పథకం ద్వారా 18వర్గాలకు చెందిన చేతివృత్తిదారులకు జీవనోపాధి కల్పించాలని బుధవారం డీఆర్‌ఓ పద్మశ్రీకి వినతిపత్రం అందజేశారు. అనంతరంకోటేశ్వరరావు మాట్లాడుతూ చేతి వృత్తిదారులకు శిక్షణ ఇవ్వడమే కాక ఆతర్వాత రూ.లక్ష రుణం మంజూరు చేయాలని, ఇందుకోసం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. బీజేపీ నాయకులు మందడపు సుబ్బారావు, నర్సింహారావు, రవి రాథోడ్, చంద్రశేఖర్, నరేష్, ఆర్‌వీఎస్.యాదవ్, ఈదుల భద్రం, అంకతి పాపారావు, నాగేశ్వరరావు, రామారావు, వెంకట్, మురళి తదితరులు పాల్గొన్నారు.


