మన కోసం.. మన ఉత్పత్తులు! | - | Sakshi
Sakshi News home page

మన కోసం.. మన ఉత్పత్తులు!

May 28 2025 12:25 AM | Updated on May 28 2025 12:25 AM

మన కో

మన కోసం.. మన ఉత్పత్తులు!

భయం.. భయం..
ఖమ్మం రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఏసీబీకి పట్టుబడిన నేపథ్యాన డాక్యుమెంట్‌ రైటర్లు కార్యాలయంలోకి అడుగు పెట్టలేదు.
● ఎస్‌హెచ్‌జీ సభ్యుల సామగ్రి అమ్మకానికి వేదిక ● కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ చొరవతో సిద్ధమైన మహిళా మార్ట్‌ ● నేడు ప్రారంభించనున్న మంత్రి తుమ్మల ● దశలవారీగా ఇతర మున్సిపాలిటీలకూ విస్తరణ

బుధవారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2025

8లో

ఖమ్మంమయూరిసెంటర్‌: మహిళా సంఘాల సభ్యులు తయారు చేస్తున్న ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కల్పించేలా ఖమ్మంలో మహిళా మార్ట్‌ సిద్ధమైంది. ఇన్నాళ్లు ఉత్పత్తులు రూపొందిస్తున్నా అమ్మకానికి సరైన వేదిక కానరాక.. అవగాహన లేక మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాణ్యమైన, ఆరోగ్యవంతమైన ఉత్పత్తులు అయినప్పటికీ డిమాండ్‌ మేర విక్రయించుకోలేకపోయారు. ఈ విషయాన్ని గమనించిన కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ ప్రత్యేకంగా మహిళా మార్ట్‌ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మార్ట్‌ సిద్ధం కాగా.. బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.

ఉత్పత్తులకు బ్రాండింగ్‌

ఎంత నాణ్యమైన, ఆర్గానిక్‌ ఉత్పత్తులైనా విక్రయించా లంటే బ్రాండ్‌ పేరు కావాలి. ఈమేరకు మహిళామార్ట్‌లో అమ్మే ఉత్పత్తులకు ‘మేడిన్‌ ఖమ్మం..ఫర్‌ ఖమ్మం’ పేరుతో బ్రాండ్‌ రూపొందించారు. ఇక్కడ అమ్మే వస్తువులన్నింటినీ ఇదే బ్రాండ్‌తో ఆకర్షణీయంగా ప్యాకింగ్‌ చేయించారు. కాగా, మార్ట్‌ నిర్వహణ విజయవంతంగా సాగాలనే భావనతో ఉత్పత్తులు నాణ్యతగా ఉన్న 20 సంఘాలను తొలిదశలో ఎంపిక చేశారు. పప్పులు, బియ్యం, కారం, పసుపు, తృణధాన్యాలతో చేసిన చిరుతిండ్లు, ఫినాయిల్‌, జూట్‌ బ్యాగ్‌లు, కాళ్ల పట్టాలు సహా పలు సరుకులను విక్రయానికి సిద్ధం చేశారు. అలాగే, మార్ట్‌ నిర్వహణ కోసం ఐదుగురికి శిక్షణ ఇప్పించారు. ఇదే బ్రాండింగ్‌తో అమెజాన్‌, ఫ్ల్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ సంస్థల ద్వారా విక్రయానికి సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలిసింది. అంతేకాక ఖమ్మంలో ఏర్పాటుచేస్తున్న మహిళా మార్ట్‌ నిర్వహణ గాడిన పడగానే మధిర, సత్తుపల్లి, వైరా, ఏదులాపురం మున్సిపాలిటీల పరిధిలోనూ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

నష్టం ఎదురుకావొద్దనే...

జిల్లాలో అధికారులతో కలిసి పర్యటించిన సమయంలోనే కాక గవర్నర్‌ వచ్చినప్పుడు మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించామని కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ అన్నారు. కానీ సరైన మార్కెటింగ్‌ సదుపాయం లేక మద్దతు ధర దక్కడం లేదని గుర్తించినట్లు చెప్పారు. మహిళామార్ట్‌ ప్రారంభ ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. మహిళలు రూపొందించిన ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలనే ప్రయత్నంలో భాగంగానే రెండు నెలల్లో భవనాన్ని సిద్ధం చేశామని తెలిపారు. ఖమ్మంలో రద్దీ దృష్ట్యా మొదటి మార్ట్‌ ఇక్కడ ఏర్పాటు చేశామని, దశలవారీగా మిగిలిన మున్సిపాలిటీల్లో తెరుస్తామని చెప్పారు.

ఖమ్మంలో ప్రారంభానికి సిద్ధమైన మహిళా మార్ట్‌

(ఇన్‌సెట్‌) మార్ట్‌లో విక్రయానికి సిద్ధంగా వస్తువులు

వాతావరణ ం

జిల్లా అంతటా బుధవారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశముంది.

మార్కెటింగ్‌ లేక..

మహిళా సంఘాల సభ్యులు నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నా సరైన మార్కెటింగ్‌ లేక నష్టపోతున్నారు. దీంతో సొంతంగా కొన్ని షాపులకు సరఫరా చేయడం లేదా వారాంతపు సంతల్లో విక్రయిస్తున్నారు. తద్వారా శ్రమకు తగిన ఫలితం లభించడం లేదు. కొనుగోలుకు వ్యాపారులు ముందుకొస్తున్నా తక్కువ ధరే లభిస్తుండడంతో నష్టం ఎదురవుతోంది. ఈ నేపథ్యాన కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ ఈ ఉత్పత్తులను పరిశీలించి మార్కెటింగ్‌ లేదనే విషయాన్ని గమనించారు. దీంతో సూపర్‌మార్కెట్‌ తరహాలో మహిళామార్ట్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఖమ్మం వైరా రోడ్డులోని జలాంజనేయ స్వామి గుడి పక్కన మెయిన్‌రోడ్డుపై ఎస్సీ కార్పొరేషన్‌ పాత భవనాన్ని రూ.30 లక్షలతో ఆధునికీకరించారు. సూపర్‌మార్కెట్‌కు అనుగుణంగా తీర్చిదిద్దారు.

న్యూస్‌రీల్‌

మన కోసం.. మన ఉత్పత్తులు!1
1/2

మన కోసం.. మన ఉత్పత్తులు!

మన కోసం.. మన ఉత్పత్తులు!2
2/2

మన కోసం.. మన ఉత్పత్తులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement