గిరిజన గురుకులాల్లో సీట్లు భర్తీ | - | Sakshi
Sakshi News home page

గిరిజన గురుకులాల్లో సీట్లు భర్తీ

May 19 2025 2:28 AM | Updated on May 19 2025 2:30 AM

ఇల్లెందు: ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకుల జూనియర్‌ బాలుర, బాలికల కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన కౌన్సెలింగ్‌కు విద్యార్థులు బారులుదీరారు. 15, 16 తేదీల్లో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 737 సీట్లు ఉండగా అన్నీ భర్తీ అయ్యాయి. బాలుర కోసం ఆర్‌జేసీ, యూఆర్‌జేసీ దమ్మపేట, ఆర్‌జేపీ, యూఆర్‌జేసీ కిన్నెరసాని డ్యామ్‌ సైట్‌, ఆర్‌జేసీ, యూఆర్‌జేసీ గుండాల, యూఆర్‌జేపీ సింగరేణి, తిరుమలాయపాలెం, ఆర్‌జేసీ కృష్ణసాగర్‌ జూనియర్‌ కళాశాలు ఉన్నాయి. ఇక బాలికల కోసం ఆర్‌జేసీ భద్రాచలం, సుదిమళ్ల, అంకంపాలెం, యూఆర్‌జేసీ భద్రాచలం, సుదిమళ్ల, మణుగూరు, కొత్తగూడెం, వైరా, అన్నపురెడ్డిపల్లి ఉన్నాయి. ఒక్క భద్రాచలం బాలికల గురుకులంలో పీఎస్‌టీటీ–20 సీట్లు, ఐఎం–20 సీట్లు, సీఎస్‌–20 సీట్లు, ఏటీ–20 సీట్లు, కిన్నెరసాని డ్యామ్‌ సైట్‌లో ఏటీ–20 సీట్లు, ఈటీ–20 సీట్లు తప్ప మిగిలిన అన్నీ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ గ్రూపులు ఉన్నాయి.

పెరుగుతున్న విద్యార్థులు..

గతంలో టెన్త్‌ విద్యార్థుల ఉత్తీర్ణత తక్కువ ఉండటం వల్ల సీట్లు భర్తీ కావటం కష్టంగా ఉండేది. కొంతకాలంగా టెన్త్‌ ఉత్తీర్ణత పెరిగింది. విద్యార్థులు ఇంటర్‌లో చేరడం వస్తున్నారు. ఈ దఫా తొలి కౌన్సెలింగ్‌లోనే 12 గురుకులాలు 18 కళాశాలల్లో చేరికలు పెరిగాయి.

సీట్లన్నీ భర్తీ అయ్యాయి

ఐటీడీఏ పీఓ ఆదేశానుసారం ఈ నెల 15, 16 తేదీల్లో జరిగిన గురుకుల బాలుర బాలికల జూనియర్‌ కళాశాలల ప్రవేశానికి పదో తరగతి మార్కుల మెరిట్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌లో సీట్లు భర్తీ చేశాం. అన్ని కళాశాలల్లో ఉన్న 737 సీట్లు భర్తీ అయ్యాయి.

–బి.అరుణకుమారి, ఆర్‌సీఓ, భద్రాచలం

గిరిజన గురుకులాల్లో సీట్లు భర్తీ 1
1/2

గిరిజన గురుకులాల్లో సీట్లు భర్తీ

గిరిజన గురుకులాల్లో సీట్లు భర్తీ 2
2/2

గిరిజన గురుకులాల్లో సీట్లు భర్తీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement