‘ఉపాధి’ చట్టంలో మార్పులు చేయొద్దు
వైరారూరల్: గ్రామీణ ప్రాంత పేదలకు అండగా నిలుస్తున్న ఉపాధి హామీ చట్టంలో మార్పులు చేయొద్దని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో మంగళవా రం నిర్వహించిన ఉపాధి హామీ కూలీల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరును మార్చడ మే కాక అనేక మార్పులు చేయడంతో కూలీ లకు పనిదొరకని పరిస్థితి ఏర్పడుతుందని తెలి పారు. ఈమేరకు కేంద్రం నిర్ణయంపై పోరాడుతామని చెప్పారు. అనంతరం ముసలిమడుగు సర్పంచ్ తడికమళ్ల నాగార్జునను సత్కరించిన ఆయన గొల్లపూడి శివారు పులిగొట్ట శ్రీ లక్ష్మీ నరసింహా ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు నూతి వెంకటేశ్వర్లు, మేడూరి రామారావు, నాయకులు పాల్గొన్నారు.
జర్మనీలో నర్సింగ్
ఉద్యోగావకాశాలు
ఖమ్మం రాపర్తినగర్: నర్సింగ్ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్), కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యాన జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా ఉపాధికల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. జర్మనీ భాషలో శిక్షణ ఇచ్చిన అనంతరం ఉద్యోగాలు కల్పన ప్రక్రియ చేపడుతారని వెల్లడించారు. బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్‌ఎం పూర్తి చేసి 1–3 ఏళ్ల ఆనుభవం ఉండడంతో పాటు 22నుంచి 38 ఏళ్ల వయస్సు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాల కోసం 94400 51581 నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.
జిల్లా జైలుకు పోట్రు ప్రవీణ్
సత్తుపల్లి: రూ.కోట్ల విలువైన సైబర్ నేరాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్లూరు మండలం యర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్‌ను ఖమ్మంలోని జిల్లా జైలుకు తరలించారు. ఆయనను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం సత్తుపల్లి సబ్‌జైలుకు తరలించిన విషయం విదితమే. ఈమేరకు ఆయనను సోమవారం రాత్రి జిల్లా జైలుకు తరలించినట్టు సత్తుపల్లి సబ్‌జైల్ సూపరింటెండెంట్ కుటుంబరాజు తెలిపారు.
సిలిండర్ పేలడంతో
ఇద్దరికి తీవ్ర గాయాలు
నేలకొండపల్లి: వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. నేలకొండపల్లికి చెందిన ఇందుమతి ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకేజీతో మంటలు మొదలై సిలిండర్ పేలినట్లు తెలిసింది. ఘటనలో ఇందుమతికి తీవ్ర గాయాలు కాగా ఆమెను కాపాడే యత్నంతో కుమారుడు వెంకటేష్ కూడా గాయపడ్డాడు. ఈమేరకు ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించారు.
యూ ట్యూబర్‌పై
కేసు నమోదు
ఖమ్మంఅర్బన్: హిందూ దేవతలపై అసభ్యకర వ్యాఖ్యలతో వీడియో రూపొందించిన యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిపై కేసు నమోదైంది. ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన అన్వేష్ ‘నా అన్వేషణ.. ప్రపంచ యాత్రికుడు’ పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆయన సీతాదేవి, ద్రౌపదీ దేవిపై అసభ్యంగా వ్యాఖ్యలతో వీడియో విడుదల చేశాడని దానవాయిగూడెంకు చెందిన జి.సత్యనారాయణరావు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. దీంతో అన్వేష్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు.
పెళ్లి పేరుతో దాడి..
ఆపై ఆత్మహత్యాయత్నం
రఘునాథపాలెం: పెళ్లి చేసుకోవాలని ఓ యువతిపై దాడి చేసిన యువకుడు ఆతర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. కామేపల్లి మండలం భాసిత్‌నగర్‌కు చెందిన గుణశేఖర్, రఘునాథపాలెం మండలం కొర్ర తండాకు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానని చెబుతూ ఆమె ఇంటికి వచ్చాడు. ఆమైపె దాడి చేసిన ఆయన ఆతర్వాత పురుగుల మందు తాగడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై యువతి కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.
●రఘునాథపాలెం మండలం పువ్వాడనగర్‌కు చెందిన ఓ యువతితో పెళ్లి సంబంధం మాట్లాడుకుంటామని చెప్పి ఖమ్మం టేకులపల్లికి చెందిన గొడుగు రాజేష్, తన కుటుంబంతో వచ్చి బెదిరించాడు. ఘటనపై యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.


