14,388 మెట్రిక్ టన్నుల యూరియా
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ప్రస్తుతం 14,388 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ అనుదీప్‌దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 10,088 మెట్రిక్ టన్నుల స్టాక్ రాగా, మరో 4,300 మెట్రిక్ టన్నులు రిజర్వ్‌గా ఉందని వెల్లడించారు. రైతులకు 18,982 మెట్రిక్ టన్నుల యూరి యా పంపిణీ చేశామని తెలిపారు. యాప్ అందుబాటులోకి వచ్చే వరకు పట్టాదారు పాస్ పుస్తకంలోని వివరాల ఆధారంగా 82 పీఏసీఎస్‌లు, 84 మంది డీలర్ల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నామని, ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచే పంపిణీ ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు.
సరిపడా యూరియా నిల్వలు
కొణిజర్ల: జిల్లాలో రైతులకు కావాల్సినంత మేర యూరియా అందుబాటులో ఉందని డీఏఓ డి.పుల్ల య్య తెలిపారు. కొణిజర్ల పీఏసీఎస్‌లో యూరియా నిల్వలను మంగళవారం పరిశీలించిన ఆయన మా ట్లాడారు. మొక్కజొన్న సాగుచేస్తున్న రైతులు ఇరవై రోజుల తర్వాత అవసమయ్యే యూరియా కోసం ఇప్పుడే రావడంతో కృత్రిమ కొరత ఏర్పడుతుందని చెప్పారు. ఈమేరకు రైతులు అపోహలు విడనాడి సిఫారసు మేరకే యూరియా వాడాలని సూ చించారు. ఈకార్యక్రమంలో డీసీఓ గంగాధర్, ఏఓ బాలాజీ, సొసైటీ స్పెషల్ ఆఫీసర్ సందీప్, సీఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


