వైభవోపేతంగా ముక్కోటి ఏకాదశి
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తగా గోవింద నామస్మరణ మార్మోగింది. స్వామి, అమ్మవార్లను దాదాపు 10 వేల మంది భక్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శనంచేసుకున్నారు. అలాగే, ఆలయంలో స్వామి వారితో పాటు ఉప ఆలయాల్లో సోమేశ్వరస్వామి, గణపతి, ఆంజనేయస్వామి, అయ్యప్ప స్వామిని కూడా దర్శించుకుని పూజలు చేశారు. కాగా, దర్శనం టికెట్లు, లడ్డూ ప్రసాదాల కౌంటర్లు, వాహన పూజలు, కేశ ఖండన వద్ద రద్దీ నెలకొంది. ఎస్‌ఐ రమేష్, సిబ్బందితో కలిసి బందోబస్తు ఏర్పాటుచేయగా మధిరకు చెందిన సత్యసాయి సేవా సమితి కమిటీ సభ్యులు సేవల్లో పాలుపంచుకున్నారు. ఆల య ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, మిథిలా స్టేడియం నిర్మాణదాత తుళ్లూరు కోటేశ్వరరావు – నిర్మలకుమారి దంపతులతో పాటు అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
జమలాపురంలో స్వామిని దర్శించుకున్న భక్తజనం
వైభవోపేతంగా ముక్కోటి ఏకాదశి


